నిన్నను ఒక సమావేశంలో నేను గమనించాను. భక్తి ప్రపత్తులు కలిగి కూడా భగవంతుణ్ణి ప్రార్థిద్దామంటే ఆ ప్రార్థనా శ్లోకాలు ఉచ్చరించలేక కొంత, అర్థం తెలియక కొంత ఇబ్బంది పడుతూ ఏమీచేయలేక నిర్లిప్తంగా ఊరుకొంటున్నారు కొందరు నిరక్షరాశ్యులు.. వారిచే నేను వసుదేవ సుతందేవం అనే శ్లోకాన్ని ఉచ్చరింపచేసే ప్రయత్నం చేశను. వారు చాలా శ్రమించారనిపించింది. నాకనిపించింది వారిభక్తి భగవంతుడికి వ్యక్తపరస్తున్న భావన వారికి కలిగే విధంగా సులభ తరంగా ఉచ్చరించ గలిగే విధంగా వారికి నచ్చే విధంగా వ్రయాలని. అందుకే ఆ శ్లోకాన్ని అనువదించాను .
శ్లోకము:-
వసుదేవ సుతం దేవం.
కంస చాణూరు మర్దనం
దేవకీ పరమానందం
కృష్ణం వందే జగద్గురుం.
కందము:-
శ్రీ వసుదేవ కుమారా!
భావజ జనకుండ! కంస ప్రాణాపహరా!
బ్రోవగ వేడెద మమ్మున్.
దేవకి సంతోష తనయ ధీప్రద కృష్ణా !.
మనం అందరికోసం కొందరమైనా ఆలోచించి శక్తి మేరకు మనకు తోచిన విధంగా మనకు చేతనయినంతలో చేయూతనిద్దాం. ఏమంటారు?
జైహింద్.
Print this post
1 comments:
Mee Blaagu Baagundi.
http://www.varudhini.blogspot.com
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.