గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, డిసెంబర్ 2008, మంగళవారం

వందే శ్రీ రంగ నాయకీం.

సహృదయ పాఠక బంధువులారా! ధనుర్మాస దీక్షా తత్పరులారా! గోదా చరణారవింద సంలగ్న మత్త చిత్తులారా! సచ్ఛీలులారా! అందరికీ ధనుర్మాస శుభారంభం సందర్భంగా అభినందనలు.

లోక కల్యాణాన్నే త్రికరణ శుద్ధిగా కాంక్షించి మనతల్లి గోదాదేవి భయంకరమైన యీ చలి రాత్రులను లెక్ఖ చేయక ప్రాతః కాలముననే దివ్య మంగల స్వరూపుడగు ఆ రంగనాధుని సేవా భాగ్యం తాను పొందుతూ, తోటి వారికీ అందించడం కోసం యెంతగానో శ్రమించింది.
అట్టి ఆ తల్లిని స్మరించే శ్లోకం మనమూ చదువుట ద్వారా ఆ తల్లిని ప్రార్ధిద్దామా!

శ్లోకము:-
కర్కటే పూర్వ ఫల్గున్యాం
తులసీ కాననోద్భవాం
పాండ్యే విశ్వంభరాం గోదాం
వందే శ్రీరంగ నాయకీం.

ఆటవెలది:-
కర్క టాఖ్య మైన అర్క మాసము, పూర్వ
ఫల్గునమున, తులసి వనము లోన,
పాండ్య దేశమందు ప్రభవించినట్టి మా
రంగ నాయకికిని ప్రణుతి సేతు.

ప్రాతః కాలాన్నే మనము ఆ గోదామాతని పై విధంగా ప్రార్ధించడం ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చాలా యోగ్యంగా వుంటుందని నా భావన. మరి మీరేమంటారు?
జైహింద్. Print this post

1 comments:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

అలవోకగా, ఆశువుగా చెబుతున్న మీపద్యాలు చాలా బాగుంటున్నాయి.ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.