గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జనవరి 2023, ఆదివారం

వేకువ జాము నందు ప్రభ వించె దివస్పతి పశ్చి మాంబుధిన్..ఽనే సమస్యకు నా పూరణము.

జైశ్రీరామ్. 

ఉ.  సోకగ సూర్యకాంతి యటు చూచెను పశ్చిమదిక్కునద్దమున్

లోకములోని వింత కలలో గనిపించుచునుండె నేమొ యం

చా కలతన్ మెలంగి యొకడత్తరి తావచియించె నౌర! యీ

వేకువ జాము నందు ప్రభ వించె దివస్పతి పశ్చి మాంబుధిన్.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.