గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, జనవరి 2023, శుక్రవారం

సంన్యాసస్య మహాబాహో తత్త్వ - ...18 - 1...//... కామ్యానాం కర్మణాం న్యాసం - ...18 - 2,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

 జైశ్రీరామ్.

అర్జున ఉవాచ|

భావము.

అర్జునుడనుచున్నాడు.

శ్లోసంన్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్|

త్యాగస్య హృషీకేశ పృథక్కేశినిషూదన. || 18-1 ||

తే.గీ. వినుహృషీకేశ! సన్యాస విషయ మెరుగ

వేరువెరుగా, తెలుపుము, విదితమవగ,

నీవు తెలిపిన గ్రహియింతు నీకు మ్రొక్కి,

తేలుపుమోకృష్ణ వివరించి, తెలియ నాకు.

భావము.

హృషీకేశా! కేశి సంహారా! సన్యాసం యొక్క తత్వాన్ని వేరువేరుగాతెలుసుకోవాలని 

కోరుతున్నాను.

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ భగవానుడన్నాడు :

శ్లోకామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః|

సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. || 18-2 ||

తే.గీ. కామ్య కర్మల త్యాగంబు ఘనతరమగు

దివ్యసన్యాసమందురు దేవరుషులు,

కర్మఫలముల త్యాగమే ఘనతరమగు

త్యాగమండ్రు వివేకులు తలచి చూడు.

భావము.

కామ్య కర్మలని వదిలి పెట్టడం సన్యాసమని ఋషులంటారు. అన్ని కర్మల ఫలాన్ని 

త్యజించడం త్యాగమని వివేకులు అంటారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.