గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జనవరి 2023, గురువారం

స్వల్పాపి దీపకణికా....మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్. 

శ్లో. స్వల్పాపి దీపకణికా

 బహుళం నాశయేత్తమః|

బోధస్స్వల్పో౭పి తత్ తీవ్రం

 బహుళం నాశయేత్తమః||

తే.గీ.  దివ్వె చిన్నదే యయినను దీర్ఘ తమము

నణచి వేయుగా, యట్టులే యల్పబోధ

యైననుంగాని గురువులు జ్ఞాన దీప్తి

శిష్యులన్ గొల్పి, పోఁగొట్టు చీకటులను.

భావము. "దీపము ఎంత చిన్న దైనను చీకట్లను పోగొట్టునట్లు ఉత్తమ 

గురువుల బోధనలు ఎంత కొద్దిగా ఉన్ననూ అంతకంటే గొప్పదైన 

అజ్ఞానమనే చీకట్లను నశింప జేయును" 

[గ్రహించే శక్తి గల శిష్యునికే యిది వర్తించును] 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.