జైశ్రీరామ్,
శ్లో. మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః|
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్. || 17-19 ||
తే.గీ. తనను హింసించుకొనుచు తాననవరతము
నితరులకు పీడ గొలుపుచు వెతలుగొలుపు
తపము తామసతపమగు ధరణిపైన
నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.
భావము.
సరిగ్గా అర్ధం చేసుకోకుండా, తన్ను తాను హింసించు కుంటూ లేదా ఇతరుకలకు
పీడా కరంగా చేయబడేది తామసికము అనబడుతుంది.
శ్లో. దాతవ్యమితి యద్దానం దీయతేऽనుపకారిణే|
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్. || 17-20 ||
తే.గీ. దేశ కాలపాత్రములుమదిని తలచుచు
ననుపకారికి దానంబు నందజేయ,
నదియె సాత్విక దానంబు ముదముగొలుపు,
నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.
భావము.
దానం చేయడం కర్తవ్యం అనేభావంతో, తిరిగి ఉపకారం చేయని వారికి దేశకాల
పాత్రలను చూచి, చేసిన దానం సాత్వికమని చెప్పబడుతుంది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.