జైశ్రీరామ్
.శ్లో. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేऽర్జున|
సఙ్గం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః. || 18-9 ||
తే.గీ. సంగ భావంబు ఫలకాంక్ష సరగున విడి,
కర్మ కర్తవ్యమని చేయ, ఘనతరముగ
సాత్వికత్యాగమనదగు, సద్విభాస!
నీవు గ్రహియింపుమా యిది నేర్పు మీర.
భావము.
కర్తవ్య బుద్ధితో సంగభావం, ఫలాపేక్ష వదిలి నియత కర్మని చేసినపుడు అది
సాత్విక త్యాగం అవుతుందని నా అభిప్రాయం.
శ్లో. న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే|
త్యాగీ సత్త్వసమావిష్టో
మేధావీ ఛిన్నసంశయః. || 18-10 ||
తే.గీ. సత్వగుణపూర్ణ మేధావి శంకవీడి
కలుగు ప్రతికూలఫలమున
కలతపడడు
నిందచేయడు దానిని నిశ్చితముగ.
నీవు గ్రహియింపుమర్జునా!
నేర్పు మీర.
భావము.
సత్వగుణంతో నిండిన మేధావి సంశయ రహితుడై ప్రతికూల కర్మని ద్వేషించడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.