జైశ్రీరామ్.
శ్లో. నియతస్య తు సంన్యాసః కర్మణో నోపపద్యతే|
మోహాత్తస్య పరిత్యాగస్తామసః
పరికీర్తితః. || 18-7 ||
తే.గీ. నియతకర్మలు విడరాదు, నిష్టకలిగి
యాచరింపవలయు పార్థ! యనితరముగ
భ్రాంతితో సన్యసించిన వానినెల్ల
త్యాగ మదితామసికమౌను,
తరపుమిదియు.
భావము.
నియత కర్మలను సన్యసించకూడదు. భ్రాంతితో వానిని సన్యసించడం
తామసిక త్యాగం అనిపించుకుంటుంది.
శ్లో. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్|
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. || 18-8 ||
తే.గీ. దేహమునకది శ్రమయంచు, మోహమునను,
భయముతో కర్మ మానినన్ ఫలము లేదు,
త్యాగమిది రాజసికమౌను, తలచి చూడ,
నీవు గ్రహియింపుమర్జునా
నేర్పు మీర.
భావము.
శరీరానికి కష్టం కలుగుతుందనే భయంతోనూ, బాధాకరమని కర్మని వదిలేస్తే అది
రాజసిక త్యాగం అవుతుంది. దానివలన త్యాగఫలం లభించదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.