జై శ్రీరామ్.
శ్లో. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః|
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్. || 17-21 ||
తే.గీ. ప్రతిఫలార్థమో, ఫలముకో, బాధపడుచు
తాను బలవంతముగ చేయు దానమరయ
రాజసికమగు, రమణీయ రాజవదన!
నీవుగ్రహియింపుమియ్యది నేర్పు మీర.
భావము.
ప్రత్యుపకారం ఊద్దేశించిగాని, ఫలాన్ని ఆశించిగాని, బలవంతంగానూ,
భాధపడుతూ ఇచ్చే దానిని రాజసిక దాన మంటారు
శ్లో. అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే|
అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్. || 17-22 ||
తే.గీ. ధర నపాత్రున, కహితమౌ సరణి, కాని
వేళ, నవమానపరచుచు, వినగరాని
విధముగాదానమును చేయ ప్రీతి గనుమ
తామసికదానమదియౌను, తలచి చూడ.
భావము.
అపాత్రునికి, తగని తగని సమయంలో, ఇవ్వకూడని చోట, అగౌరవంతో, అవమానిస్తూ ఇచ్చేది తామసిక దానమని చెప్పబడుతుంది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.