జైశ్రీరామ్.
[6:51 am, 15/01/2023] Chinta Rama Krishna Rao:
సహృదయులయిన జ్ఞాన స్వరూపులయిన మీకు మకరసంక్రాంతి శుభాకాంక్షలు.
శ్రీలక్ష్మీనరసింహుల పరిపూర్ణ ఆశీస్సులు మీ అందరికీ లభించాలని
మనసారా కోరుకొంటున్నాను.🙏
ఇట్లు
సుజనవిధేయుడు
చింతా రామకృష్ణారావు.
[8:25 am, 15/01/2023] రాణీ సదాశివ మూర్తి: 🌱🎋🌾🐄🐂🌅🐓🌾🎋🌱
సిక్తోऽసితైర్హిమకణై: పరితశ్శుభార్కః
రక్తోऽధునా తవ శుభోదయగీతగానే।
స్నిగ్ధాభ ఏష తనుతాన్మకరే ప్రవిష్ట:
సన్మంగళాని పరివారయుతాయ తుభ్యమ్ ।।
భావం: అంతటా అసితమైన (ప్రాత: కాలమగుటచేత అంత తెల్లగా లేని)
మంచుకణములచే తడుపబడిన సూర్యుడు మీ శుభోదయ
గీతగానమునందు ఇష్టము కల్గిన ఉన్నాడు. మకరమున ప్రవేశించిన
స్నిగ్ధ కిరణుడైన ఆ రవి మీ పరివారముతో కూడిన మీకు,
సన్మంగళములను కలుగజేయు గాక!
ఆచార్య రాణి సదాశివ మూర్తి
🌱🎋🌾🐄🐂🌅🐓🌾🎋🌱
[11:15 am, 15/01/2023] Chinta Rama Krishna Rao: 🙏🙏🙏
[7:51 am, 31/01/2023] రాణీ సదాశివ మూర్తి:
శతకవ్రాతము శాతకుంభఛవులన్ సంతానవృక్షద్యుతిన్
హితమున్ బంచుచు మించుమోదమొసగన్ హ్రీంకారసంధాయిగా।
శ్రితభక్తాళికి దేవతాళి శుభముల్ చింతాన్వయార్యోక్తులన్
నుతులన్ నిల్చుచు నిక్కమిచ్చు వినుడో నూర్లేఱులన్ హంసలై।।
చింతాన్వయార్య - శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు
నూర్లేఱులన్ - శతకప్రవాహములలో
[9:25 am, 31/01/2023] Chinta Rama Krishna Rao:
మాటల్ రావు మహాత్మ మిమ్ము పొగడన్, మాబోటి యల్పజ్ఞులన్
మేటిన్ జేసి వచించుటన్నది ఘనమ్మే, మీదు సద్భావనా
పేటిన్ మంచియె కల్గుటన్ మహిమతో వీక్షింపఁ జేసెన్ ననున్,
పాటింతున్ భవదీయ భావనకు తగన్, భవ్యా! నమస్కారముల్🙏
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.