గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జనవరి 2023, మంగళవారం

ఓంతత్సదితి నిర్దేశో బ్రహ్మణ - ...17 - 23...//... తస్మాదోమిత్యుదాహృత్య - ...17 - 24,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము

 జైశ్రీఎరామ్.

శ్లోఓంతత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః|

బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. || 17-23 ||

తే.గీ. బ్రహ్మమును జూపు గుర్తులు వరలు మూడు,

కనగ నోం, తత్తు, సత్తును, కలిగె వీటి

నుండిబ్రాహ్మణుల్, వేదముల్, దండి యజ్ఞ

ములురచింపగబడె పుణ్యపురుష!

భావము.

ఓం తత్ సత్ అనేవి బ్రహ్మపదార్ధాన్ని నిర్ధేశించే మూడు సంకేతాలని చెప్పబడుతోంది

వీటితోనే పూర్వం బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు ఏర్పరుప బడినాయి.

శ్లోతస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః|

ప్రవర్తన్తే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్. || 17-24 ||

తే.గీబ్రహ్మవాదులీహేతువున్ వరలు మంత్ర

ములకు ముందు నోంకారంబు పలుకుచుంద్రు

యజ్ఞ, దానతపములందు, విజ్ఞులగుచు

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

అందుచేత "ఓం"అంటూ బ్రహ్మవాదుల చేత శాస్త్ర విధాన ప్రకారం నిత్యమూ 

యజ్ఞ దాన తపః కర్మలు చేయబడు తున్నాయి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.