జైశ్రీరామ్.
శ్లో. పృథక్త్వేన తు యజ్జ్ఞానం నానాభావాన్పృథగ్విధాన్|
వేత్తి సర్వేషు భూతేషు తజ్జ్ఞానం విద్ధి రాజసమ్. || 18-21 ||
తే.గీ. వేరువేరుగ కనిపించు వివిధ రూప
ములను జీవులు వేరని తలచుటదియె
రాజసికమగు జ్ఞానంబు, రాజ తనయ!
పార్థుడా! నీవు గ్రహియించు ప్రస్ఫుటముగ.
భావము.
వేరు వేరు కనబడే రూపాలలో వేరువేరు జీవుళ్ళు ఉన్నారని గ్రహించేది రాజసిక జ్ఞానమని
తెలుసుకో.
శ్లో. యత్తు కృత్స్నవదేకస్మిన్కార్యే సక్తమహైతుకమ్|
అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్. || 18-22 ||
తే.గీ. ఒక్క వస్తువే సర్వమం చొప్పనట్టి
యుక్తికి విరుద్ధముగనెంచి,
యొప్పనట్టి
విధముగా పట్టుకొనుటది విశ్వమందు
తామసికమగు జ్ఞానమ్ము, తలచు మిదియు.
భావము.
ఒక వస్తువే సర్వమూ అని, యుక్తికి విరుద్ధంగా, అసంబద్ధంగా, అల్పత్వంతో
పట్టుకు కూర్చునేది తామసిక జ్ఞానమని అనబడుతుంది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.