జైశ్రీరామ్.
శ్లో. నియతం సఙ్గరహితమరాగద్వేషతః కృతమ్|
అఫలప్రేప్సునా కర్మ యత్తత్సాత్త్వికముచ్యతే. || 18-23 ||
తే.గీ. విగతసంగము, మరి ఫలాపేక్ష రహిత
ము ననురాగమునుద్వేషములకు దూర
ముగ మసలి చేయు నిత్యకర్మ గతిసాత్వి
కముగ నెరుగుమీవర్జునా!
కనుము నిజము.
భావము.
సంగభావం లేక, ఫలం మీద ఆశ లేక, రాగ ద్వేషాలు లేక చేసిన నిత్య కర్మ సాత్విక కర్మ.
శ్లో. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః|
క్రియతే బహులాయాసం తద్రాజసముదాహృతమ్. || 18-24 ||
తే.గీ. కోరికలతోడను దురహంకారమునను,
మిక్కుటమ్మగు శ్రమతోడ మేదినిపయి
చేయుకర్మ రాజసికంబు, చిత్తమలర
వినుచు గ్రహియింపుమర్జునా!
విశదముగను.
భావము.
కోరికతో అహంకారంతో బహు శ్రమతో చేసే కర్మ రాజసిక కర్మ.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.