గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, మే 2014, ఆదివారం

మమేతి బద్ధ్యతే జంతుః , న మమేతి విముచ్యతే.మేలిమి బంగారం మన సంస్కృతి194.

జైశ్రీరామ్.
శ్లో. ద్వే పదే మోక్ష బంధస్య , మమేతి , న మమేతి చ
మమేతి బద్ధ్యతే జంతుః , న మమేతి విముచ్యతే.
                                        క. నాదిగ తలచిన బంధము. 
కాదిదినాదియనుకొనిన కలుగును మోక్షం
బేదిశుభం బనుకొందువొ
యాదారినినడువుమయ్య, యమలిన చరితా!  
భావము. ముక్తికి గానీ, బంధానికి గానీ రెండు పదాలు కారణమౌతున్నాయి. “మమ” (ఇది నాది) అనుకుంటే అది బంధం. “న మమ ” ( ఇది నాది కాదు) అనుకుంటే మోక్షం. 
జైహింద్.                                                    

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
బంధానికీ మోక్షానికీ గల వైవిధ్యాన్ని తెలియ జేసి నందులకు ధన్య వాదములు నేను నాది అనుకున్నంత వరకు మోకానికి దారేది ? చాలా బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.