జైశ్రీరామ్.
శ్లో. కిం వాససైవం న విచారణీయం , వాసః ప్రధానం ఖలు యోగ్యతాయాః
పీతాంబరం వీక్ష్య దదౌ తనూజాం ,
దిగంబరం వీక్ష్య విషం సముద్రః !
గీ. వలువయే పెంచు మనిషికి విలువనిలను.
పీత వస్త్రున కిచ్చె విఖ్యాత రమను,
సాంబునకునిచ్చె విషము దిగంబరుఁడని
రత్న గర్భుఁడు. తెలియుడీ క్రమము మీరు.
భావము. వస్త్రధారణలో ఏముందిలే - అని తేలికగా అనుకోకూడదు. అదియే యోగ్యతకు ప్రధానం. సముద్రుడు - పీతాంబరం కట్టుకొన్న విష్ణువుకు తన కుమార్తెను ఇచ్చాడు! దిగంబరుడైన శివునికి విషం ఇచ్చాడు ! (కొందరు ఆడంబరానికే ప్రాధాన్యం ఇస్తారని చమత్కారం)
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.