జైశ్రీరామ్.
శ్లో. అకాలే కృత్యమారబ్ధం కర్తుర్నార్థాయ కల్ప్యతే తదేవ కాల ఆరబ్ధం మహతేஉర్థాయ కల్ప్యతే.
క. సమయము గని పనులు మనము
సముచితముగ సలుప సుఫల చయము కన నగున్
సమయము విడి సలుపు పనులు
సముచిత ఫలమొసగవు కద! సమయము కననౌన్.
భావము. సమయంకాని సమయంలో ప్రారంభించిన పని కర్తకు ప్రయోజనాన్ని కల్పించదు. అదే పనిని సరియైన కాలంలో ప్రారంభిస్తే అతనికి గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.