జైశ్రీరామ్.
శ్లో. దుర్లభం త్రయ మేతత్ దైవానుగ్రహ హేతుకమ్ మనుష్యత్వం , ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయః.
క. దుర్లభమిల నరజన్మము.
దుర్లభమిల మోక్ష కాంక్ష. దొరకిన ఘనమే.
దుర్లభము సుజన సంగతి.
దుర్లభములు దైవగతిని దొరకును మనకున్.
భావము. మనుష్యజన్మ , మోక్షకాంక్ష , మహాత్ముల ఆశ్రయం అనే మూడూ దుర్లభమైనవి . అవి దైవానుగ్రహం వల్లనే లభిస్తాయి.
జైహింద్.
1 comments:
నంస్కారములు
అవును అసలు మనిషిగా పుట్టడమే ఒకగొప్ప వరం కనీసం అప్పుడైనా మంచిపనులు చేసి తరించా లనుజోరు ఇక మహాత్ముల ఆశ్రయం సరేసరి అసలు గుర్తించేదెవరు .చాలా బాగుంది ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.