గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, మే 2014, గురువారం

కురు పుణ్యమహోరాత్రం, మేలిమి బంగారం మన సంస్కృతి 203.

జైశ్రీరామ్.
శ్లో. త్యజ దుర్జన సంసర్గం,భజ సాధు సమాగమం
కురు పుణ్యమహోరాత్రం, స్మరనిత్యమనిత్యతామ్.
క. వీడుము దుష్టుల సంగతి.
వేడుము సజ్జనుల తోడు.వివిధ సుకర్మల్ 
వీడక చేయుము సతతము.
నీడగ మృతి కలదటంచు నిరతము కనుమా!
భావము. చెడ్డవారితో సాంగత్యం వదలాలి.సజ్జనులతో స్నేహాన్ని కాంక్షించాలి. రాత్రింబవళ్ళు పుణ్యకార్యాలు చేయాలి. అనునిత్యమూ అనిత్యతను గుర్తు చేసుకోవాలి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మన స్నేహితుల్ని బట్టి మనల్ని అంచనా వేస్తారు సజ్జన సాంగత్యం చాలా అవుసరం వీలైనంత దైవ చింతన అలవరచు కోవడం అన్ని విధాలుగా మంచిది బాగుంది ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.