గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, మే 2014, ఆదివారం

యో న్యాయమన్యథా బ్రూతే , స యాతి నరకం నరః.మేలిమి బంగారం మన సంస్కృతి 199.

జైశ్రీరామ్.
శ్లో. మానాద్వా యది వా లోభాత్ క్రోధాద్వా యది వా భయాత్ 
యో న్యాయమన్యథా బ్రూతే , స యాతి నరకం నరః. 

గీ. హేతు వేదైన కావచ్చు ఖ్యాతమైన
న్యాయమును వీడి తీర్పరి నడచెనేని
రౌరవాది నరకములఁ జేరునతఁడు.
జన్మజన్మలకీ పాప చయము విడదు.
భావము. దురభిమానం వల్లగానీ , లోభం వల్లగానీ , కోపంతోనో, భయంతోనో గానీ న్యాయాన్ని దాచిపెట్టి మరో విధంగా తీర్పుచెప్పిన మనిషి నరకానికి పోతాడు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

బనస్జారములు
న్యాయాధి కారి తీర్పు పైన వారి భవిష్యత్తు ఆధార పడి ఉంటుంది అసలు ఆ పదవి చాలా పవిత్ర మైనది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.