జైశ్రీరామ్.
శ్లో. మహతామాశ్రయః పుంసాం , ఫలం భాగ్యానుసారతఃఈశస్య కంఠ లగ్నో உపి వాసుకిః వాయుభక్షకః.
గీ. ఘనుల యాశ్రయమున్నను కలుగ బోదు
లేని యోగము. మనకున్నదేను కలుగు.
శివుని కంఠంబు నుండియు చిత్రముగను
గాలినే తిను వాసుకి. కలిగె నదియె.
భావము. ఎంత గొప్పవారిని ఆశ్రయించుకొని ఉన్నా, ఫలితం మాత్రం అదృష్టానుసారమే దక్కుతుంది. ఐశ్వర్యకారకుడైన శివుని కంఠాన్ని కౌగిలించుకొని ఉన్నా వాసుకి కేవలం గాలినే భక్షిస్తున్నాడు కదా.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.