జైశ్రీరామ్.
శ్లో. మందోஉప్యమందతామేతి సంసర్గేణ విపశ్చితః పంకచ్ఛిదః ఫలస్యేవ నికషేణావిలం పయః .
గీ. అల్పుడధికునితో గూడ నధికుఁడగును.
ఘనుల సంసర్గమునకల్గు ఘన ఫలంబు.
మలిన జలబిందువైనను మంచిముత్య
మట్లు మెఱయును పద్మపత్రాంబువయిన.
భావము. అల్పుడైనా విద్వాంసులతో కలిసి ఉండటంతో అనల్పుడౌతాడు. కలుషిత జలబిందువైనా తామరాకుమీద పడిన కారణంగా ఒక మంచి ముత్యంలా తళతళలాడిపోతుందికదా!
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవును ప్రముఖులు ,పండితులు ఐన వారి చెంత నుండటం వలన ఎంత తెలివి లేని వారైనా కొంత జ్ఞానాన్ని సంపాదించుకోగలరు అమాయకుడైన తోటకుడు గురుసుశ్రూష జేసి వృత్తాలు వ్రాయగలిగాడు కదా ! మంచి సూక్తి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.