జైశ్రీరామ్.
శ్లో. పఠంతి చతురో వేదాన్ ధర్మశాస్త్రాన్యనేకశః
ఆత్మానం నైవ జానంతి దర్వీ పాక రసం యథా.
ఆత్మానం నైవ జానంతి దర్వీ పాక రసం యథా.
గీ. వేదములు నేర్చి ధ్ర్మార్థ వేత్తయయ్యు
ఆత్మ సుజ్ఞాన హీనుడు వ్యర్థ జీవి.
వంట రుచి నెన్నగల్గునే వంట గరిటె?
ఆత్మ సుజ్ఞానపూర్ణులై యలర వలయు.
భావము. చతుర్వేదాలు, అనేక ధర్మశాస్త్రాలు చదివినా ఆత్మజ్ఞానం తెలియనివాడు - రుచిగల వంటల్లోని గరిటె వంటివాడు. (ఆరుచిని , సారాన్ని గరిటె ఆస్వాదించలేదు కదా )
జైహింద్.
1 comments:
నమస్కారములు
నిజమే ఆత్మజ్ఞానంతో కొంచ మైనా ఆచరించ లేనప్పుడు ఎన్ని చదివినా తెలుసుకున్నా దండగే మంచి మాట
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.