గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, మే 2014, శుక్రవారం

దుర్లభం త్రయ మేతత్ దైవానుగ్రహ హేతుకమ్. మేలిమి బంగారం మన సంస్కృతి 192.

జైశ్రీరామ్.
శ్లో. దుర్లభం త్రయ మేతత్ దైవానుగ్రహ హేతుకమ్ 
మనుష్యత్వం , ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయః. 

క. దుర్లభమిల నరజన్మము.
దుర్లభమిల మోక్ష కాంక్ష. దొరకిన ఘనమే.
దుర్లభము సుజన సంగతి.
దుర్లభములు దైవగతిని దొరకును మనకున్.
భావము. మనుష్యజన్మ , మోక్షకాంక్ష , మహాత్ముల ఆశ్రయం అనే మూడూ దుర్లభమైనవి . అవి దైవానుగ్రహం వల్లనే లభిస్తాయి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నంస్కారములు
అవును అసలు మనిషిగా పుట్టడమే ఒకగొప్ప వరం కనీసం అప్పుడైనా మంచిపనులు చేసి తరించా లనుజోరు ఇక మహాత్ముల ఆశ్రయం సరేసరి అసలు గుర్తించేదెవరు .చాలా బాగుంది ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.