గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, డిసెంబర్ 2008, బుధవారం

NEW YEAR WISHES

3 comments

New Year Wish...





As we bid adieu to the old year
and greet the new,
my thoughts will be on you.
I want you to know that when
the sky is ablaze with fireworks
as midnight arrives,
I'll wish your year
is the best ever
and that you'll keep
the new year hope alive
in your heart forever.


Great things await you in 2008.






స్వప్నిక మరణం తీరని లోటు.

3 comments

ఏసిడ్ దాడికి గురయి 20 రోజులుగా చికిత్స పొందుతున్న స్వప్నిక మరణ వార్త మాకు చాలా బాధ కలిగించింది. సుకృతినో రల్పాయుః.

కారణం ఏదైనా ఆమె తల్లిదంద్రులకు, కుటుంబ సభ్యులకు సహృదయులకు ఆమె మరణం తీరని లోటు.

ఆమె తల్లి దండ్రులకూ, కుటుంబ సభ్యులకు నాయొక్క, మా పాఠకుల యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను

ఔచిత్య విచక్షణాధికారం మీదే.

0 comments

ఈ శ్లోకంలోని కవి భావన ఏమైయుంటుంది?

శ్లోకము:-
కేశవం పతితం దృష్ట్వా
భీమం చైవ గతాయుషం
రుదంతి కౌరవాః సర్వే
పాండవాః హర్ష మాయుః.

ఈ శ్లోకం చదివేరు కదా ఏమైనా ఔచిత్య యుక్తంగా వుందా యీ శ్లోకం?
కేశవుడు పతితమైపోవడం చూచిన భీముడు గతాయుషు డయేడట. కౌరవులు ఏడుస్తున్నారట. పాండవులు సంతోషించారట.

ఈ శ్లోకంలో అనౌచిత్యం లేదనుకుంటే కామెంట్ పంపడం ద్వారా మీ వ్యాఖ్య పాఠకులమనో ఫలకాలపై ముద్రితమయేలాగ చేయ వలసినదిగా నా కోరిక.
జైహింద్.

30, డిసెంబర్ 2008, మంగళవారం

ఉత్తమ కథా సంపుటి బహుమతి దక్కించుకొన్న " పండుగ "

2 comments

















కవి వతంస బిరుదాంకితులైన శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు రచించిన " పండుగ " అనే కథ ప్రసన్న భారతి అనే మాస పత్రికలో 2002 జనవరి మాసంలో ప్రచురితమైంది. ఆ పండుగ కథ పేరుతోనే తాను రచించిన 12 వివిధ పత్రికలలో ప్రచురితమైన కథలను చేర్చి కథా సంపుటిగా వీరు ప్రచురించారు.

మచిలీ పట్ణంలోని ప్రమిద సాహిత్య పత్రికా నిర్వాహకులు శ్రీ బి.వి.కె. రావు గారు వారి మాత్రుమూర్తి శ్రీమతి సీతా కుమారి గారి పేరున ప్రతీ సంవత్సరం ఉత్తమ సాహిత్య కథా సంపుటి కొరకు ఇచ్చే బహుమతిని ఈ సంవత్సరం ఈ పండుగ అనే బులుసు వారి కథా సంపుటికి యిచ్చారు. దీనితో పాటు ఆరు వేల రూపాయలు నగదు పారితోషకంగా యిచ్చారు. అంతటి ప్రతిభా సంపన్నులు మన బులుసు వేంకటేశ్వర్లు గారు.

వీరు వివరిస్తున్న కవి సమ్రాట్ విశ్వనాధ భావుకత మనబ్లాగు ద్వారా మీ కిదివరకే పరిచయం కావున వేరే చెప్పవలసిన పని లేదు.

ఈ పైన చూపబడిన ఛాయా చిత్రాలలో ప్రముఖ వ్యక్తి శ్రీ పురాణం సుబ్రహ్మణ్యం గారి మేనల్లుడూ, ప్రముఖ కథా రచయిత అయిన సోమంచి రామం గారిని, ఆడిటర్ శ్రీ కె.శరత్ కుమారార్ ను కూడా చూడ వచ్చు.
జైహింద్.

ధారణాద్ధర్మ మిత్యాహుః. మేలిమి బంగారం మన సంస్కృతి 44

0 comments

ధర్మము - దాని నిర్వచనము - ధర్మార్థులకు సూచన.
ధర్మంగా ప్రవర్తించండి. ఇది మీకు ధర్మమేనా? ధర్మో రక్షతి రక్షితః అని అనేక విధములుగా నిత్యం ధర్మ ప్రస్థావన మనమధ్య చోటు చేసుకోవడం మనకు నిత్యానుభవమే. ఐతే ఆ ధర్మాన్ని ఒక శ్లోకంలో చక్కగా నిర్వచించారు. చూడండి.
శ్లోకము:-
ధారణాద్ధర్మ మిత్యాహుః
ధర్మో ధారయతే ప్రజాః
యత్స్యాద్ధారణ సమ్యుక్తః
ధర్మ యితి నిశ్చయం.
:-
ధారణమున చేసి ధర్మమనబడును.
ధర్మమే ప్రజలను ధాత్రి మోయు.
ధారణమున యేవి తప్పక ధర్మమున్
నిలుపు. నవియె ధర్మ ములన నగును.
భావము:-
ధరించేది కావున ధర్మ మనబడుచున్నది. ధర్మమే ప్రజలను ధరిస్తూ వుంటుంది. ఏది సంఘాన్ని కట్టుబాట్లలో నిలుపుతూ వుంటుందో అదే ధరమమని చెప్ప బడుతోంది.
ధర్మాచరణ విషయంలో మనం కఠినాతి కఠినమైన నిర్ణయాలు శాశ్వితమైన సాంఘిక సంక్షేమం కొఱకు తీసుకోవడం అత్యవసరమని చెప్పక తప్పదు. అదే ధర్మము. అదే సంఘాన్ని శాశ్వితంగా నియమ బద్ధంగా నడుపుతుంది. కావుననే అది ధర్మమయింది. మనం కూడా ధర్మ బద్ధమైన సంఘంలో నిశ్చింతగా జీవించుతూ, మనతోటివారూ మనలాగే చక్కగా జీవించడం కోసం మనమూ ధర్మ బద్ధులమై ప్రవర్తించడం సముచితము. మరి మీరేమంటారు?
జైహింద్.

29, డిసెంబర్ 2008, సోమవారం

షడ్విధా నాతతాయినః .మేలిమి బంగారం మన సంస్కృతి 43

0 comments

ఆకతాయి కాదు. ఆతతాయి.
మనలో చాలామంది కుర్రకారుచేసే చెడు పనులు చూచి వట్టి ఆకతాయిసుమా ఆ అబ్బాయి అని అంటూంటాము. ఇక్కడ మనమొక విషయం గమనించాలి. అసలు ఆకతాయి అంటే యేమిటని.
అసలు ఆకతాయి అనే పదం కాదు ఆపదం ఆతతాయి. ఆతతాయి అని యెవరినన వచ్చో ఒక చక్కని నిర్వచనం ఒక శ్లోకములో వుంది. చూడండి.
శ్లో:-
అగ్నిదో గరదశ్చైవ
శస్త్రోన్మత్తో ధనాపహః
క్షేత్ర దార హరశ్చేతాన్
షడ్విధా నాతతాయినః .
తే:-
అగ్ని విషములు బెట్టెడి అధముల, మఱి
ఆయుధంబునజంపెడి అశుభ పరుల,
క్షేత్ర దారల హరియించు కౄరుల, గని
ఆతతాయిగ చెప్పగ నర్హమగును.

భావము:-
ఇంటికి కాని, సంసారములో కాని అగ్గి పెట్టే వారినీ, పరులపై విష ప్రయోగము చేసే వారినీ లేదా విషము గ్రక్కే వారినీ, ఆయుధముతో దాడి చేసే వారినీ, భూములనపహరించే వారినీ, భార్య నపహరించే వారినీ, ఆతతాయిలు అని అన వచ్చును.
ఇప్పుడు అనుసరణీయం కాక పోయినా పూర్వ కాలంలో ఈ ఆతతాయిల విషయంలో గల శిక్ష ఒక శ్లోకం వివరిస్తోంది. మనం అనుసరించ వద్దు కాని ఆ శ్లోకంలో ఏం చెప్పారో తెలుసుకొందాము .
శ్లో:-
గురుం వా, బాల, వధ్వౌవా,
బ్రాహ్మణంవా బహు శృతం.
ఆతతాయిన మాంతవ్యం
హంత్యాదే వవిచారయన్.
తే:-
గురువు, బాల వధువనక, గొప్ప వేద
విదుడు బ్రాహ్మణుడనకుండ కౄరముగను
ఆతతాయైన చంపగ నర్హమయ్య.
యోచనేమియు లేకయే. నీచు లంచు.
భావము:-
ఆతతాయి అయితే అట్టి వారు గురువవ వచ్చును, బాలులవ వచ్చును, స్త్రీ లవ వచ్చును, అనేక వేదముల నెఱిగిన బ్రాహ్మణు లవ వచ్చును, అటువంటి వారిని విచారణ చేయనక్కర లేకుండానే హతమార్చ వచ్చును.
ఇది ఈనాటి న్యాయము కాదని మనం ముఖ్యంగా గ్రహించాలి. పూర్వ కాలంలో ఎంతటి నిబద్ధతతో ప్రతీవారూ ప్రవర్తించ వలసి వుండేదో , ఎంతటి కట్టుబాట్లు కలిగుండేవో మనం గ్రహించడానికే యీ శ్లోకాలు మనం తెలుసుకోవలసి వుందని మాత్రం చెప్పగలను.
జైహింద్.

కవి సమ్రాట్ విస్వనాధ భావుకత 10

5 comments

కవి సమ్రాట్ విశ్వనాధవారు కల్పవృక్షంలో గుంభనగా పొదివిన భావుకతను కవి వతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు వెలువరిస్తూ చేసిన ఉపన్యాసంలో 10 వ పద్యంలోని భావుకతనిప్పుడు తెలుసుకొందాం.

రామాయణ కల్ప వృక్షము - కిష్కింధా కాండ - నూపుర - 10.
తేటగీతి:-
పెనగొనియె నిందు నశ్వత్థ వృక్షకంబు
నింబ వృక్షమ్ము. మిన్ను పూనినది తాళ
ముం బెనంగొనె నిచ్చటభువిని కూట
ములు పవిత్రములపవిత్రములు స్ఫురింప.

శ్రీ రాముడు సీత జాడను వెదుకుతూ పంపా అరణ్య భూముల్లో సంచరిస్తున్నాడు. వసంత సౌందర్య సముపేతమైన అరణ్య భూముల్లోని ప్రకృతిని వీక్షిస్తూ ముందుకు సాగుతున్న రాముని మనః స్థితి మనం విశ్వనాధ భావుకత ద్వరా ఈ పద్యంలోనిది తెలుసుకొంటున్నాం.

ఆ వనములో ఒకచోట వేప చెట్టుతో పెనవేసుకొని పెరిగిన రావి చెట్టు కనిపించినది. శ్రీ రాముడు కొంచెం తల పైకెత్తి చూడగానే ఆ చెట్లను ఒక టాళ వృక్షము కూడా పెనవేసుకొన్నదట. ఈ సమాగమము రామునకు పవిత్ర అపవిత్ర కూటములను స్ఫురింప జేసినది అని కవి వర్ణించెను.

అశ్వత్థ ( రావి ) నింబ ( వేప ) వృక్షములు మన దేశీయులకు దేవతా వృక్షముల వంటివి. ప్రాణ వాయువును శుద్ధి చేయుటలో యీ రెండు వృక్షములూ గొప్ప సామర్ధ్యము కలవని విజ్ఞాన శాస్త్ర వేత్తలు నేడు అంగీకరిస్తున్నారు కూడా. మన పూర్వులు యీ రావి, వేప చెట్లకు పెండ్లి చేసే వారు. వేప చెట్టు అమ్మవారు. రావి చెట్టు నారాయణుడు. భగవద్గీతలో విభూతి యోగంలో " అశ్వద్ధ స్సర్వ వృక్షాణాం " అని సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మయే చెప్పి యున్నాడు.

పవిత్ర ప్రదేశాలలో ఒకే పాదున వేప రావి చెట్లను పెంచుతారు. ఇది మన సంప్రదాయం. ఇది ఆది దంపతుల అన్యోన్యతకు ప్రతీక. ఒకప్పుడు ఇది క్రతు ధాత్రి. కనుక యీ చెట్లు కలయిక పవిత్రముగా కంపించినా ఇప్పుడా క్రతు ధాత్రి అడవి అయిపోయిన కారణంగా ఆ చెట్లతో ఒక తాళ వృక్షం పెన వేసుకొన్నది. అది అపవిత్ర కూటమి అయినది. ఈ వర్ణన వలన జానకీ రాముల పవిత్ర దాంపత్యము, వారి జీవితములందు ప్రవేశించిన రావణుని దౌష్ట్యము ఈ అపురూప భావన ద్వారా కవి తెలియ జేయు చున్నాడు.

విశ్వనాధ సంప్రదాయ వాదిగా పేరు తెచ్చుకొన్న కవి. జతీయత సంప్రదాయకత ఆయన కలానికి తిరుగు లేని శక్తి. ఆయన యెన్ని గ్రంధాలు రచించినా అన్నింటిలో జాతీయ సంప్రదాయ నిష్ఠలనే సందేశముగా చూపినాడు. ఏచిన్న అవకాశం దొరికినా విశ్వనాధ దానిని తన పంథాకు అనుగుణంగా వర్ణిస్తూనే వుంటాడు. ఇది మహా కవి లక్షణం. తన జీవిత కాలం ఒక లక్ష్యం వైపే ప్రయాణిస్తూ గొప్ప రచనలు చేసిన విస్వనాధ తెలుగు వారు గర్వింగా చెప్పుకొనే మహా కవి.
" స్వస్థాన వేష భాషాభిమతా స్సంతో రస ప్ర లుబ్ధ ధియః
సాధ్యోహి రసోః యథా తథం కవిభిః "
అన్న ఆలంకారిక వాకాలకు విశ్వనాధ జీవితం, ఆయన కావ్య జీవితం రెండూ గొప్ప ఉదాహరణలు.
ప్రస్తుత సమయంలో ఈ వర్ణన శ్రీ రాముని నిర్వేద స్థితిని సూచిస్తున్నది.

చూచారుకదా! కవివతంస కవిసమ్రాట్ భవుకతను ఎంత అద్భుతంగా వివరించారో. మరో పద్యాన్ని సమయం చిక్కినప్పుడు చెప్పుకొందాం. శ్రీ బులుసువారు విశాఖ జిల్లాలో చిట్టి వలస గ్రామంలో యి.యస్.ఐ. హాస్పటల్ వద్ద కల్ప వృక్షం అనే స్వ గృహంలో నున్నారు.పిన్:-531 162. నేరుగా మనం వారిని లేఖాముఖగా అభినందించ వచ్చు.
జైహింద్.

28, డిసెంబర్ 2008, ఆదివారం

చోరోపమః సత్ కవిః

0 comments

మన తెలుగు కవుల, సంస్కృత కవుల రచనా చమత్కారం హృదయానంద జనకంగా వుంటుంది. ఈ భరత భూమి ఎంతటి మహనీయులకాలవాలమో కదా! అట్టి మహనీయుల చమత్కార రచనలు మన మనస్సును ఆకట్టుకొనక మానవు. చూడండీ క్రింది శ్లోకాన్ని.

శ్లోకము:-
మందం నిక్షిపతే పదాని . పరితః శబ్దం సముద్దీక్ష్యతే.
నానార్థా హరణం చ కాంక్షతి . ముదాలంకార మాకర్షతి.
ఆదత్తే సకలం సువర్ణ నిచయం. ధత్తే రసాంతర్గతం.
దోషాన్వేషణ తత్పరో విజయతే చోరోపమః సత్ కవిః.

ఈ శ్లోకంలోని రసాస్వాదన చేయలేనివారెవరుంటారు? {నేనుతప్ప.}

మీరూ పఠించారు కదా! దీనిలో గల చమత్కారాన్ని పద్య రూపంలో గాని, గద్య రూపంలో గాని మీరు " పోష్టే కామెంట్" ద్వారా నా బ్లాగుకు పంపిన వారైతే అది చదివే భాగ్యాన్ని అనేక మందికి కలిగించినవారౌతారు. ఇందు నిమిత్తము ముందుగా మీకు నా ధన్య వాదములు. మరి మీ స్పందనకై యెదురు చూడనా?
జైహింద్.

27, డిసెంబర్ 2008, శనివారం

ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్. మేలిమి బంగారం మన సంస్కృతి 42

0 comments

ఆరోగ్యాదులనిచ్చే దేవతలు:-
మనకు ఆరోగ్యము, సంపద, జ్ఞానము, మోక్షము, వాంఛనీయము. వాటిని ఏయే దేవతల అనుగ్రహం వలన పొంద వచ్చో ఈ క్రింది శ్లోకం వివరిస్తోంది చూడండి.
శ్లో:-
ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్.
ధన మిచ్ఛే ద్ధుతాశనః.
జ్ఞానం మహేశ్వరా దిచ్ఛేత్.
మోక్ష మిచ్ఛే జ్జనార్దనః.
తే:-
సూర్యు డారోగ్యమిచ్చును సుజనులార!
సంపదలనగ్ని యొసగును. సరసులార!
జ్ఞాన మీశ్వరుడిచ్చును. జ్ఞానులార!
మోక్షమిచ్చుజనార్దనుండక్షయముగ.
భావము:-
మనకు ఆయువు నొసగు వాడు సూర్య భగవానుడు. సంపదల నొసగు వాడు అగ్ని. జ్ఞాన మొసగు వాడు మహేశ్వరుడు . మోక్ష మొసగు వాడు జనార్దనుడు.
మనము ఆయా దేవతల నుపాసించి ఆయువును, సంపదను, జ్ఞానమును, మోక్షమును పొంద వచ్చును. మరి ఆయా దేవతల నుపాసించడం ద్వారా ఆ నాల్గింటినీ పొందుదామా?
జైహింద్.

చెప్పుకోండి చూద్దాం?

2 comments

ఈ క్రింది శ్లోకాన్ని చదవండి.
అందులో మన కొక వస్తువును సూచిస్తున్నాడు.
మనకు చివరికా వస్తువేమిటై యుంటుంది? అనే ప్రశ్న మిగిల్చాడు.
దానిని చదివి అదేమిటై వుంటుందో ఊహించగలరా?
ఊహించ గలిగితే సమాధానాన్ని వీలైతే ఒక చిన్న పద్యంలోను,
కాదనుకుంటే మీకు నచ్చిన విధం గాను
పోష్టే కామెంట్ ద్వారా
పంప గలందులకు మనవి చేయుచున్నాను.

శ్లో:-
వృక్షాగ్ర వాసీ. నచ పక్షి రాజః.
త్రి నేత్ర ధారీ. నచ శూల పాణిః.
చర్మాంగ ధారీ, నచ సోమ యాజీ.
జలంచ ధత్తే, న ఘటో, న మేఘః .

తే:-
వృక్షమునకు పైనుండును. పక్షి కాదు.
తాను ముక్కంటి. మఱి శూల పాణి కాడు.
రాజిత వపు ధారియె. సోమ యాజి కాడు.
జలమొసగు. కాని, ఘట, మేఘములును కావు.

చూచారు కదా? మరి మీ సమాధానలకోసం నేనెదురు చూడనా?
నా ఎదురు చూపు నిరర్థకం కాదనుకొంటాను.

జైహింద్.

26, డిసెంబర్ 2008, శుక్రవారం

పీడయేన్న స్నుషాదికం.మేలిమి బంగారం మన సంస్కృతి 41

0 comments

పిల్లల మనస్తత్వాన్ని తెలుసుకొని మసలుకోవలి.
చాలా మంది తల్లి దండ్రులు తమ పిల్లలపై మితి మీరిన ప్రేమతో, అతి చనువువల్ల, చిన్న తనం నుంచీ వారు పెద్దవారౌతున్నా గాని నోటికొచ్చినట్లు తిట్టుతూ, కొట్టుతూ ఉంటారు. జ్ఞాన తెలిసి వచ్చిన పిల్లలను అలా చెయడం సరయిన పద్ధతి కాదు. ఈ విషయాన్ని తెలిపే ఒక శ్లోకముంది చూడంది.
శ్లో:- షోడశాబ్దాత్పరం పుత్రం
ద్వాదశాబ్దాత్ పరం స్త్రియం
న తాడయేద్దుష్ట వాక్యైః
పీడయేన్న స్నుషాదికం.
తే:- మిత్ర సముడు పదారేండ్ల పుత్రుడగును.
మాతృసమ పది రెండేండ్ల పుత్రికయును.
కొట్ట రాదిక వారిని తిట్ట రాదు.
కోడలిని,పర స్త్రీలనూ కొట్ట రాదు.
భావము:- పదహారేళ్ళు దాటిన పుత్రులను, పండ్రెండేండ్లు దాటిన పుత్రికలను, తిట్ట రాదు. పరుష వాక్యములతో బాధించనూ కూడదు. కోడళ్ళు మొదలైన స్త్రీ జనములను పీడించ కూడదు, బాధించ కూడదు.
చూచారు కదా! ఎంత చక్కగా మనస్తత్వ శాస్త్రాన్ని ఆకళింపు చేసుకొని యదార్థం వివరించాడో! ఈ విషయం తెలియ నప్పుడు పిల్లల్ని కొట్టమంటే, తిట్టామంటే అర్థముంది. ఇప్పుడు తెలిసింది కదా! ఇటుపైనిక అలా చేయడం భావ్యం కాదు కదా? మనసెరిగి మసలుకొందామా మరి?
జైహింద్.

25, డిసెంబర్ 2008, గురువారం

కృష్ణం వందే జగద్గురుం.

1 comments

నిన్నను ఒక సమావేశంలో నేను గమనించాను. భక్తి ప్రపత్తులు కలిగి కూడా భగవంతుణ్ణి ప్రార్థిద్దామంటే ఆ ప్రార్థనా శ్లోకాలు ఉచ్చరించలేక కొంత, అర్థం తెలియక కొంత ఇబ్బంది పడుతూ ఏమీచేయలేక నిర్లిప్తంగా ఊరుకొంటున్నారు కొందరు నిరక్షరాశ్యులు.. వారిచే నేను వసుదేవ సుతందేవం అనే శ్లోకాన్ని ఉచ్చరింపచేసే ప్రయత్నం చేశను. వారు చాలా శ్రమించారనిపించింది. నాకనిపించింది వారిభక్తి భగవంతుడికి వ్యక్తపరస్తున్న భావన వారికి కలిగే విధంగా సులభ తరంగా ఉచ్చరించ గలిగే విధంగా వారికి నచ్చే విధంగా వ్రయాలని. అందుకే ఆ శ్లోకాన్ని అనువదించాను . శ్లోకము:- వసుదేవ సుతం దేవం. కంస చాణూరు మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కందము:- శ్రీ వసుదేవ కుమారా! భావజ జనకుండ! కంస ప్రాణాపహరా! బ్రోవగ వేడెద మమ్మున్. దేవకి సంతోష తనయ ధీప్రద కృష్ణా !. మనం అందరికోసం కొందరమైనా ఆలోచించి శక్తి మేరకు మనకు తోచిన విధంగా మనకు చేతనయినంతలో చేయూతనిద్దాం. ఏమంటారు? జైహింద్.

24, డిసెంబర్ 2008, బుధవారం

నాతి చరామి.

1 comments


భార్యాతిక్రమణ దోషము:-

ప్రియ సాహితీ బంధువులారా! సుమనర్నమస్సులు.
మనం రామాదివద్వర్తితవ్యం అని నేర్చుకొనే వుంటాం కదా! భగవంతుడే సాక్షాత్తు ఎన్ని అవతారాలెత్తినా మానవులకు ఒక్క రామావతారమే ఆదర్శంగా చెప్పుకోవడంలోగల ఆంతర్యం గ్రహించ లేకపోలేము కదా!
రాముడు పితృ వాక్య పరిపాలకుడు. మీదుమిక్కిలి ఏక పత్నీవ్రతుడు కూడాను.

ధర్మార్థ కామాల్లో భార్య నతిక్రమించకూడదని శాస్త్రం చెప్పడమే కాదు. పెళ్ళినాటి ప్రమాణాలు కూడా అదే కదా?
ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్యం. అని వరుడుచేత ప్రమాణం చేయించి అందుకంగీకరించిన పిడపనే అంటే నాతి చరామి అని అన్న పిదపనే కన్యా దాత తన కుమార్తెను అనగా వధువును వరునికి దానంగా యిస్తాడు.
అంత నమ్మకం కలిగించి ఒక స్త్రీని తనకు ఇల్లాలుగా పొంది ధర్మ బద్ధంగా ప్రవర్తించ వలసిన పురుషుడు ఆమె యిష్టానికి వ్యతిరేకంగా పెళ్ళినాటి ప్రమాణాల్ని తుంగలో త్రొక్కి హేయంగా ప్రవర్తించడం అతి హేయమైన పని. మగ జన్మనెత్తినవాడు నిజ జీవితంలోను, వైవాహిక జీవితంలోను రాముడిలా ప్రవర్తించాలి. అది ధర్మము.

ఈ సామాజిక ధర్మాన్ని అధిగమించినవారు రౌరవాది నరకాల్ని పొందుతారు. ఐతే ఒక్కొక్కప్పుడు అనుకోని అవకాశం ధర్మాతిక్రమణకు దోహదపడవచ్చు. బలోద్ధతమైన ఇంద్రియ గ్రామముచే భార్యను అతిక్రమిస్తే, .....తరువాత జరిగిన తప్పును తెలుసుకొని........... పశ్చాత్తప్తుడైతే .........అట్టి వానికి ఆ చేసిన పాపానికి చెప్పిన ప్రాయశ్చిత్తమును బోధాయన సూత్రాల్లో మనం చక్కగా గమనించ వచ్చు. ఆ సూత్రాన్ని పరిశీలిద్దామా?

బోధాయన సూత్రము:-
దారా వ్యతిక్రమీ ఖరాజినం బహిర్లోమ పరిధాయ " దారా వ్యతిక్రమణే భిక్షాం " ఇతి సప్తాగారాణి చరేత్. సావృత్తిః షణ్ మాసాన్.

చంపకమాల:-
వరగుణ యైన భార్య నటు వంచన చేసి, పరాంగనన్ సమా
దరణము చేసి పొంది తది తప్పు. క్షమింపను, భిక్ష, వేడుచున్
దిరిపము నెత్తుకో వలయు దీనత గాడిద చర్మ మూని. తా
గురుతుగ నారు మాసములు. గుర్తుగ రోజుకు యేడు యిండ్లలోన్.

భావము:-
భార్యను మోసగించి పరస్త్రీ లోలుడై మానసికముగ కాని, శారీరకముగ కాని అనుభవించినవాడు ఆ దోషమునకు ప్రాయశ్చిత్తముగా తన వొంటిపై గాడిద చర్మమును కప్పుకొని { అంటే నేను బుద్ధిలేని గాడిదను సుమా అని తెలియ జెప్పడం } రోజుకు యేడిండ్లలో మాత్రమే భార్యనతిక్రమించి పరస్త్రీతో సంభోగించిన పాపాత్ముడను. అట్టి నాకు భిక్ష వేయుడు. అంటూ ముష్టి ఎత్తుకొనుచూ ఆ వచ్చిన పదార్థముతోనే జీవనం సాగిస్తూ యి విధంగా ఆరు నెలలు జీవించాలి. ఆ విధంగా చేస్తే ఆ పాపం కొంత శమిస్తుంది.

చూచారా. భార్యాతిక్రమణ ఎంతటి ఘోరాతి ఘోరమైన పాపమో? అంతటి పాపం చేయకుండా బుద్ధిగా జీవించడమే మనకు మంచిది కదా! మరి మనం మంచిగా వుందామా?
జైహింద్.

23, డిసెంబర్ 2008, మంగళవారం

కర్మణా జాయతే భక్తిః. మేలిమి బంగారం మన సంస్కృతి 40

0 comments

కర్మ > భక్తి > జ్ఞానం > ముక్తి.
మనము అందరం కూడా ముక్తి పొందాలనే కోరుకుంటూంటాం. ఐతే ఆముకిని సాధించడం కోసం అనేక మార్గాల ననుసరిస్తాం.
శ్రీ కృష్ణ భగవానుడు గీతలో సూచించిన ముక్తి మార్గాన్ని పరిశీలిస్తే అది చాలా సులభము. సుఖతరము. అది యేమిటో చూద్దామా.
శ్లో:-కర్మణా జాయతే భక్తిః
భక్త్యా జ్ఞానం ప్రజాయతే
జ్ఞానాత్ ప్రజాయతే ముక్తిః
ఇతి శాస్త్రార్థ సంగ్రహః.
తే:-కర్మ వలననె భక్తి తా కలుగు నిజము.
భక్తి వలననె జ్ఞానంబు ప్రభవ మందు.
ముక్తి మార్గము జ్ఞానము . ముక్తి సుఖము.
గీత శాస్త్రార్థ సంగ్రహ స్ఫూర్తి గనుడు.
మానవుడు ముక్తిని గోరితే అది నిష్కామ కర్మ మార్గము ద్వారానే సాధ్యమగును. కర్మ వలన భక్తి ప్రభవించును. భక్తి వలన జ్ఞానము ప్రభవించును. జ్ఞానము వలననే ముక్తి ప్రాప్తించును. అట్టి ముక్తి శాశ్వతానంద దాయకము. దుఃఖాతీతము. కాన మనము కూడా నిష్కామ కర్మ నాచరించుట ద్వారా భక్తి > జ్ఞాన > ముక్తులను పొందడాని కుపేక్ష యెందుకు. సత్కర్మలనాచరిద్దాం.
జైహింద్.

22, డిసెంబర్ 2008, సోమవారం

ఆరోగ్యం ప్రదదాతు నో దినకరః. మేలిమి బంగారం మన సంస్కృతి 39

0 comments

నవ గ్రహ ప్రసాద సిద్ధిరస్తు:-
మనము శుభ కార్యా లప్పుడు మంత్ర ద్రష్టలగు పండితులు కార్య క్రమానంతరం మహదాశీర్వాదం చేసి,ఏతత్ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహానాం అనుకూల ఫల సిద్ధిరస్తు. అని దీవించడమూ, ఆ పిదప అందరూ తథాస్తు. అనీ అనడం మనం వింటుంటాం కదా!
మనం కూడా లోక కల్యాణ కర నవగ్రహ ప్రసాదసిద్ధిని లోకులకు కంక్షిస్తూ చెప్పడానికి తగిన శ్లోకమొకటుంది. నేర్చుకుందమా? ఐతే ఆ శ్లోకాన్ని చూడండి.
శ్లో:-ఆరోగ్యం ప్రదదాతు నో దినకరః. చంద్రో యశో నిర్మలం.
భూతిం భూమి సుతః. సుధాంశు తనయః ప్రజ్ఞాం. గురుర్గౌరవం.
కన్యాః కోమల వాగ్ విలాస మతులం . మందో ముదం సర్వదా.
రాహుర్బాహు బలం విరోధ శమనం . కేతుః కులస్యోన్నతిం.

శా:-ఆరోగ్యంబును సూర్యుడిచ్చు. శశి తా నత్యంత కీర్తిన్. సిరిన్
ధారాపాతముగా నొసంగు కుజుడున్. దక్షుండుగా నిల్చి తా
తీరున్ ప్రజ్ఞ నొసంగి కాచు బుధుడున్. ధ్యేయంబుతో గౌరవం
బారోపించును సద్ గురుండు. భృగుడున్ భాషన్ మహన్మాధురిన్.
ధీరుండౌ శని నిత్య శాంతి సుఖముల్. ధిష్ణ్యంబునా రాహువున్.
కోరన్ దగ్గ కులోన్నతిన్ కృపను చే కూర్చున్ సదా కేతువున్.
భావము:-సూర్యుడు ఆరోగ్యమును, చంద్రుడు నిర్మలమైన కీర్తిని, కుజుడు సంపదలను, బుధుడు ప్రజ్ఞను, గురుడు గౌరవమును, శుక్రుడు కోమల వాగ్విలాసమును, శని సంతోషమును, రాహువు బాహు బలమును, శత్రు నాశనమును,కేతువు కులోన్నతిని చేకూర్చెదరు గాక.
ఈ విధంగా మనం ఆశీర్వదించ వచ్చునుకదా. తప్పక యీ శ్లోకాన్ని, పద్యాన్ని కంఠస్తం చేసి సమయోచితంగా పఠిద్దాం.
జైహింద్.

21, డిసెంబర్ 2008, ఆదివారం

సంధ్యా దీపం నమోస్తుతే. మేలిమి బంగారం మన సంస్కృతి 38

0 comments

సంధ్యా దీప వందనము:-
తమసోమా జ్యోతిర్గమయ ! అంటూ మనం ప్రార్ధిస్తాం కదా! అట్టి జ్యోతిని గూర్చిన అవగాహన మనకవసరమే కదా? మన మందరం సంధ్యా సమయంలో చేసే జ్యోతిని గూర్చిన ప్రార్థన ఒకటుంది కదా! దాని నిప్పుడు చూద్దాం.
శ్లో:-దీపం జ్యోతిః పర బ్రహ్మా
దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపం నమోస్తుతే.

:-దీపము జ్యోతి సురూపము.
దీపము తిమిరమును బాపు. తేజము నొసగున్.
రూపము చూపెడి సంధ్యా
దీపమునకు నంజలింతు. తృప్తిగ నెలమిన్.
భావము:-దీపము ప్రజ్వలనమే స్వరూపముగా కలది. అదియే పర బ్రహ్మము. అన్నిటి మీదను సమానముగా తేజస్సును బరపును. అట్టి దీపము వలననే సర్వ కార్యములూ సుగమములగుచున్నవి. అట్టి సంధ్యా దీపమా! నీకివే నా వందనములు.
కన్నులున్నా కబోదులం మనం రాత్రి సమరంలో దీపపు కాంతి లేకపోతే. ఔనంటారా? కాదంటారా. అలాంటి దీపము సాయం సంధ్య మొదలు మళ్ళీ సూర్యోదయం వరకూ మన కన్నులకు వస్తు సముదాయాన్ని కనిపింప చేస్తుంది. జీవన గమనానికి కన్నులెంత ముఖ్యమో కాంతి కూడా అంతే ముఖ్యంకదా. అందుకే అలాంటి కాంతినిచ్చే సంధ్యాదీపానికి ప్రతీ సంధ్యా సమయంలో మనం నమస్కరించడం మనకున్న సంస్కారానికి నిదర్శనం. ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసి రోజూ ప్రార్థన చేద్దామా మరి?
జైహింద్.

20, డిసెంబర్ 2008, శనివారం

కామయే దుఃఖ తప్తానాం ప్రాణినా మార్తి నాశనం..మేలిమి బంగారం మన సంస్కృతి 37

0 comments

జీవ కారుణ్యము:-
మహనీయులకూ, మహర్షులకూ నిలయము మన భరత భూమి. మహనీయులెప్పుడూ పరోపకారార్థ జీవులనే విషయం భాగవతం లోని ఈ క్రింది శ్లోకంలో మనం చూడవచ్చు.
శ్లో:-నత్వహం కామయే రాజ్యం.
న స్వర్గం, నా పునర్భవం.
కామయే దుఃఖ తప్తానాం
ప్రాణినా మార్తి నాశనం.
క:-కోరను రాజ్య సుఖంబును.
కోరను స్వర్గంబు నిజము. కోరను ముక్తిన్.
కోరెద దుఃఖార్తుల దరి
చేరి, తపన బాపి, రక్ష సేయుండనుచున్.
భావము:-భారతీయుడు తన హృదయములో ఇలా అనుకొంటున్నాడు. నేను రాజ్య సంపద కోరను. స్వర్గము ప్రాప్తింప జేయమని కోరను. జన్మ రాహిత్యము వాంఛింపను. సంసార దుఃఖ సంతప్తులైయున్నవారికడనుండి వారి ఆర్తిని బాపి, వారి దుఃఖమును పోగొట్టమని మాత్రము కోరుదును.
చూచారా! ఎంతటి నిస్వార్థమైన కోరికో! అదీ మన సంస్కృతి. అదీ మన భారతీయత. అదీ మన మహోన్నత స్వభావము. ఇంతటి మహనీయ భావ పూర్ణ దేశీయుల మగుట మన పూర్వ జన్మ తపః ఫలము కాక మరొకటి కాదు కదా? ఇంత చక్కటి శ్లోక సంపదను మనం కంఠస్థం చేయకుండా ఉపేక్షించడం మనకి ధర్మమేనా? ఆలోచించండి. ఆలోచించి ఏంచెయ్యాలో చేద్దామా?

జైహింద్.

19, డిసెంబర్ 2008, శుక్రవారం

సర్వే చ సుఖినస్సంతు. మేలిమి బంగారం మన సంస్కృతి 36

2 comments

సాటి లేని మేటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి:-
ప్రియ పాఠక మహాశయులారా! ఆంధ్రామృత పాన మత్త చిత్తులారా! మేలిమి బంగారమైన మన భారతీయ సంస్కృతిని మీ ముందుంచే భాగ్యము ఆ భగవానుడు నాకు ప్రసాదించినందుకు చాలా ఆనందంగా వుంది.
నిజముగా మన భారత భూమి వేద భూమి మరియు దేవ భూమి. దేవతలకు సృష్టి యావత్తు సమానమే. అదే పద్ధతిని మన భారతీయులు కూడా సృష్టి యావత్తు బాగుండాలనికోరుకొనే తత్వం కలవారుగాన వీరినే దేవతలనవచ్చును. అందరి క్షేమాన్ని కోరుదురనడానికి తార్కాణంగా కనిపించే ఈ క్రింది శ్లోకాన్ని చూడండి.
శ్లో:-సర్వే చ సుఖినస్సంతు.
సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్.

:-లోకులు సుఖముగ నుండుత.
లోకులు రోగములు లేక లొంగక నిలుతన్.
లోకులు మంగళ మొందుత.
లోకులు దుఃఖములు లేక డుంకక నిలుతన్.
భావము:-
లోకమంతటా యెల్లరూ సుఖముగా ఉందురు గాక.
ఎల్లరునూ రోగములు లేనివారై యుందురు గాక.
అందరునూ కల్యాణములనే చూచెదరు గాక.
ఏఒక్కరూ దుఃఖము పొందకుందురు గాక.

చూచారా ఎంతటి చక్కని ఆకాంక్షయో. మన భారతీయులు మాత్రమే ఇంతటి ఉదార గుణ సంపన్నులు. లోకము నందలి ఎల్లరూ సఖ సంతోషాలతో అనారోగ్యాలు లేక ఆనందంగా హాయిగా ఉండాలని నిత్యమూ ప్రార్ధిస్తుంటారు. ఔనుమరి. ఉదార చరితులకు లోకమంతా కుటుంబమే కదా.
మనమూ భారతీయులమై పుట్టినందుకు గర్విస్తూ పైన చెప్పిన విధంగా నిత్యమూ ప్రార్థన చేస్తూ మన ఔన్నత్యాన్ని నిరూపించుకొందామా?
జైహింద్.

18, డిసెంబర్ 2008, గురువారం

ఏష ఆదేశః ఏష ఉపదేశః . మేలిమి బంగారం మన సంస్కృతి 35

0 comments

-->అవశ్యాచరణీయ ధర్మాలు:-
సామాజిక జీవనం సాగించే మానవుడు అవశ్యాచరణీయ ధర్మాలు మన వేదాల్లో అత్యద్భుతంగా వివరించబడ్డాయి. తైత్తరీయారణ్యకములో విశదము చేసిన మానవ ధర్మాలను చూద్దాము.
తైత్తరీయారణ్యకము:-
01. 
సత్యం వద.                                                                                                                                           ధర్మం చర.
స్వాధ్యాయాన్మా ప్రమదః
సత్యము పలుకుత. ధర్మము
నిత్యము పచరించుగాత. నిర్మల మతితో
స్థుత్యపు స్వాధ్యాయమునౌ
న్నత్యముతో గనుత విడక. నరులున్నతికై
భావము:- నరులు సత్యమును పలుకుదురు గాక.
ధర్మమును అనుష్టింతురు గాక.
స్వాధ్యాయము నేమఱకుందురు గాక.
ఔన్నత్యమును పొందుదురు గాక.

02.
ఆచార్యాయ ప్రియం ధనం ఆహృత్య ప్రజా తంతుం మా వ్యవచ్ఛేత్సీః .
సత్యాన్న ప్రమదితవ్యం.
ధర్మాన్నప్ర,మదితవ్యం.
:-గురునకు ప్రియ ధన మొసగిన
తరువాతనె వంశవర్ధ తనయుల గనుతన్.
సు రుచిర సత్యము మఱువక
స్థిరమగు ధర్మంబువిడక తేజము గనుతన్.
భావము:- గురువునకు ప్రియమగు ధన మార్జించి యిచ్చిన పిమ్మట వంశము నిలుపుటకై సత్ సంతానమును బడయ నగును.
సత్యమార్గము నేమఱకూడదు.
ధర్మ మార్గమును వీడ రాదు.

03.
కుశలాన్నప్రమదితవ్యం.
భూత్యైనప్రమదితవ్యం.
స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నప్రమదితవ్యం.
తే:-కుశల, కల్యాణ కర్మల, కోరుకొను
మృద్ధి, స్వాధ్యాయ ప్రవచన వృద్ధి యెడ ప్ర
మాద మనునది నొందక మసలు గాత.
మానవులు భువిపైన తా మనుత సతము.
భావము:- కుశలము నుండి, కల్యాణ కర్మల నుండి, సమృద్ధి నుండి, స్వాధ్యాయ ప్రవచనముల నుండి, ప్రమాదమునొంద కుందురు గాక.
04. 
దేవ పితృ కార్యాభ్యాం నప్రమదితవ్యం. 
మాతృ దేవో భవ.
పితృదేవో భవ.
ఆచార్య దేవో భవ.
అతిథి దేవో భవ.

తే:- దేవ పితరుల కార్యముల్ దీక్ష జేసి,
తల్లి దండ్రియు, గురువును దైవమనగ
అరసి, యతిథి దైవము గాంచి యాదరించి,
జ్ఞాన మొప్పగ నడచుత! మానవుండు.

భావము:- దేవ పితృ కార్యములను విడువ కుందురు గాక.
తల్లిని, తండ్రిని, గురువును, దైవముగా భావింతురు గాక.
అతిథిని దైవముగా భావించి గౌరవింతురు గాక.

05. 
యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని, నో ఇతరాణి.
యాన్యస్మాకగ్ ం సుచరితాని తాని త్వయోపాస్యాని, నో ఇతరాణి.

తే:- నింద్య కర్మలు విడిచి, యనింద్యములను
చేయు గావుత! మాయందు చేయ దగిన
వేవి సత్కర్మలుండెనో నీవు కూడ
చేయ దగినవి. తప్పులు చేయ రాదు.

భావము:- అనింద్య కర్మ లేవి కలవో వాటినే అచరింతురు గాక.
నింద్య కర్మలు ఆచరింప కుందురు గాక.
ఆర్యులు ఆచరించిన సత్ కర్మ లేవి యుండునో వాటినే ఆచరింతురు గాక.
ఇతరములగు నింద్య కర్మలు విడిచి పెట్టుదురు గాక.

06. 
ఏకేచాస్మ చ్ఛ్రేయాగ్ ం సో బ్రాహ్మణాః తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం.
క:- మన శ్రేయము వాంఛించెడి
గుణ మణులగు బ్రాహ్మణులను కూరిమితోడన్
మనమాదరించి సద్ బో
ధనలను గ్రహియింపనగును. ధర్మంబిదియే.

భావము:- సత్ పురుషులు ఎవరు మనకు శ్రేయస్కాములో వారిని సుఖాసీనులను జేసి,
సేద తీర్చి వారి బోధనల సారమును గ్రహింతురు గాక.

07. 
శ్రద్ధయా దేయం.. అశ్రద్ధయా z దేయం.
శ్రియా దేయం. హ్రియా దేయం.
భియా దేయం. సంవిదా దేయం.

క:- ఈయగ వలయును శ్రద్ధగ,
ఈయగ తగు హెచ్చుగాను. యించుకెయనుచున్
ఈయగ వలయును సిగ్గున.
ఈయగ తగు భయముతోడ. నిచ్చెడి వేళన్.

భావము:- గురువులకు ఏదైనా సమర్పించు నపుడు శ్రద్ధతో ఈయవలెను.
అశ్రద్ధతో నీయ రాదు.
హెచ్చుగా ఈయలేదని సిగ్గుతో ఈయవలెను.
భయముతో ఈయవలెను.
సంపదకు తగినట్లుగా ఈయవలెను.

08. అథ యది తే కర్మ విచికిత్సా వా వృత్తి చికిత్సా వా స్యాత్ అథా భ్యాఖ్యాతేషు యే తత్ర బ్రాహ్మణాః సమ్మర్శినః యుక్తా అయుక్తాః అలూక్షాః ధర్మ కామాః స్యుః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః
తే:- ధర్మ సందేహ మొందిన తఱిని మనకు
ధర్మ సుజ్ఞాన గణులు, సత్ కర్మ పరులు
ధర్మ కర్ములు సౌమ్యులు దార్శనికులు.
వారు చూపిన మార్గముల్ వలయు నెపుడు.

భావము:- ధర్మ సంశయము కలిగినప్పుడు ధర్మాధర్మ నిర్ణయ సమర్థులు, ఆచార్య పురుషులు, కర్మ స్వతంత్రులు, పరమ సౌమ్యులు, ధర్మ కాములు అగు మహానుభావు లెట్లాచరించిరో ఆయా సందర్భములలో అట్లే ఆచరింప తగును.
09. 
ఏష ఆదేశః
ఏష ఉపదేశః
ఏషా వేదోపనిషత్
ఏతదనుశాసనం
ఏవ ముపాసితవ్యం.
ఏవ ముచైతదుపాస్యం.

క:- ఈ చెప్పిన దాదేశము
ఈ చెప్పిన మాట నిక్క మిది యుపదేశం
బీ చెప్పినయది వేదము.
ఈ చెప్పుట శాసనంబు నెఱుగుచు నడుమా!

భావము:- ఈ పైన చెప్పినదే ఆదేశము.
ఇదే ఉపదేశము,
ఇదే వేద రహస్యము.
ఇదే ఈశ్వరానుశాసనము.
దీనిని ఆచరింతురు గాక.
ఇదే ఆచరణీయము.

జైహింద్.

17, డిసెంబర్ 2008, బుధవారం

తల్లి దండ్రులే పిల్లల కాదర్శం 3.

0 comments

తల్లి దండ్రులు తమ పిల్లలకు తాము ఆదర్శవంతంగా వుండాలీ అంటే ఎలాగుండాలో యింత వరకూ 2 భాగములు చెప్పుకొన్నాం.
ఇప్పుడు 3 వ భాగంలో కొంత తెలుసుకొందాం.

దైవ ప్రార్థనచేసుకొనిన పిదప కాల కృత్యాలు తీర్చుకోవాలి. సూర్యోదయానికి పూర్వమే ఈ పనులన్నీ ముగించుకోవాలి. దైవాలకు మేఏలుకొలుపులు పాడాలి.

మేలుకో శ్రీ రామా మేలుకో వయ్యా .
మేలుకొని లోకాలా నేలుకోవయ్యా .

అలాగే తులసిని మేలుకొలపాలి.
మేలుకొనవే రామ తులసీ
మేలుకొనవే కృష్ణ తులసీ
మేలుకొనవే శంభు తులసీ
మేలుకొనవమ్మా తులసీ మేలుకో.

అలాగే మీ యింట కొలువై వున్న దేవతలను మేలుకొల్పాలి.
మీరు నేర్చిన విధముగా మీ యింటి దైవాలకు ప్రాతః కాలాన్నే పూజ జరపాలి.

ఆతరువాత మీ యింటనున్న మీ పెద్దలైన తల్లిదంద్రులకు పాదాభివందనం చేయాలి.
ఈ చేసేవన్నీ మీ పిల్లల దృష్టిలో పడక మానవు. తదుపరి మీ దిన చర్యలకు ఉపక్రమించాలి.

మీ దిన చర్యలలో మీ పాత్ర చాలా బాధ్యతా యుతంగా వుండాలనే విషయాన్ని మీరు విస్మరించరాదు.
మీ ప్రతీ కదలికా మీ పిల్లలపై ప్రభావం చూపుతుంది. ఆచి తూచి మాటాడుతూ వుండాలి. అసందర్భంగా అనాలోచితంగా ఎలా పడితే అలా, ఏవి పడితే అవి మాటాడ రాదు.

కుటుంబ సభ్యులందరి విషయంలోనూ మీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వుండాలి.
పక్షపాత బుద్ధి చూపరాదు.

పిల్లలనతిగా ప్రేమిస్తున్నట్లు కనబడాలి. అతి గారాబం మాత్రం చేస్తున్నట్లు కనిపించకూడదు.
మీకంటే పైవారే బాగా తమని చూస్తున్నారనే చెడు భావం పిల్లలో ఏనాడూ కలగనీయకుండా మీకంటె గొప్పగా మరెవ్వరూ తమను చూడరనే భావం మీ పిల్లలకు కలిగేలాగ మీరు ప్రవర్తించ గలగాలి. అప్పుడే పిల్లలు మీ చెప్పుచేతల్లో వుంటారు. పైవాళ్ళ మాటలకు లొంగిపోరు.

మీకు ఎంతమంది పిల్లలున్నా ప్రతీ వొక్కరూ తమని మీరు ప్రత్యేక శ్రద్ధతో చూస్తున్నారనే భావం మీ పిల్లలో కలిగించేలా మీ ప్రవర్తన చాలా చాకచక్యంతో కూడి వుండక తప్పదు.

ఇప్పటికే మీకు చాలా బోరు కొట్టి వుంటుంది. ఆ భగవంతుడు మళ్ళీ అవకాశం కల్పించినపుడు మరికొన్ని చిట్కాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దామా!
జైహింద్.

గాయంతి దేవాః కల గీతికాని. మేలిమి బంగారం మన సంస్కృతి 34.

1 comments

భారత భూమాత ప్రాశస్త్యము
భూమిపై జీవకోటి తమ కర్మ ఫలాన్ని బట్టి ఎక్కడోక్కడ పుట్టుతూనే వుంటుంది. మంచి చెడ్డలను తానూ అనుభవిస్తుంది.
ఐతే భారత భూమిపై జన్మించుట అనే భాగ్యం చాలా పుణ్య ఫలం వల్ల మాత్రమే సంభవిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహించక్కరలేదు. సాక్షాత్తు విష్ణు పురాణంలోనే భరత భూమిని ప్రశంసిస్తూ ఒక శ్లోకముంది.
పరిశీలించండి.
శ్లో:- గాయంతి దేవాః కల గీతికాని
ధన్యాస్తు తే భారత భూమి భాగే
స్వర్గాపవర్గాస్పద మార్గ భూతే
భవంతి భూయః పురుషాః సురత్వాత్.

:- భారత భూమిపై కలుగు భవ్య మహాద్భుత జన్మ జన్మ. యీ
భారత మాతృ గానమును భక్తిగ దేవత లాచరింత్రు. యీ
భారత భూమి స్వర్గ పథ ప్రస్ఫుట మార్గము, ముక్తి మార్గమున్.
భారత మాతకున్ కడుపు పంటగ పుట్టుట భవ్య యోగమే.
చూచారా ఎంత అద్భుత భావనో. సాక్షాత్తూ విష్ణు పురాణంలో భరత మాతను గూర్చి ఆనాడే యిలా వ్రాశారంటే ఎంత పునీతమైన భూమిపై మనం జన్మించామో తెలుస్తోందా?
భావము:-ఓ భారత మాతా! నీ బిడ్డలు ధన్యులు. నిన్ను గూర్చి దేవతలు గానం చేస్తున్నారు. స్వర్గ లోకమునకు, మోక్షమునకు నీవే మార్గము. సోపానమూ నీవే సుమా. ఎంతో పుణ్యము చేసుకొనిన ప్రాణికి మాత్రమే నీ సంతతిగా పుట్టే భాగ్యం లభిస్తుంది. అని విష్ణు పురాణం భరత మాతను ప్రశంసించింది.
అంతటి ప్రాశస్త్యము గల భరత భూమిపై జన్మించిన మన జన్మ ఎంత పునీతమైందో కదా! ఈ పుణ్య భూమిపై పుట్టినందుకు సన్మార్గ వర్తులమై మన యోగ్యతను నిరూపించుకుందాం.
జైహింద్.

16, డిసెంబర్ 2008, మంగళవారం

తల్లి దండ్రులే పిల్లలకాదర్శం 2

0 comments

తల్లి దందులే పిల్లల కాదర్శం 1 వ భాగంలో తల్లి దంద్రులు పిల్లలకే విధంగా ఆదర్శమో తెలుసుకొన్నాం కదా! ఇప్పుడు ఆ తల్లి దంద్రులు ఆదర్శవంతంగా వుండాలంటే ఎలాగుండ వచ్చో చూద్దాం.

సాధారణంగా దంపతులు తాము తల్లి దండ్రులం కాబోతున్నాం అనువిషయం వారి మనసులో పడేసరికి అనిర్వచనీయమైన దివ్యానుభూతిని పొందుతారు. గర్భస్థ శిశువు ఆరోగ్యం కోసం అనేకమైన జాగ్రత్తలు తీసుకొంటారు. బిడ్డ పుట్టిన తరువాత కూడా చాలా శ్రద్ధగా చూసుకొంటారు. ఐతే ఆ బిడ్డడు ప్రతీ క్షణం తల్లిదంద్రుల, పరిసరాల, పరిశీలన తోనే ప్రపంచ జ్ఞానం క్రమ క్రమంగా పొందుతున్న విషయం సరిగా గుర్తించకపోవడం వల్లో, లేక నిరంతర ప్రక్రియ కావున అంత లోతుగా ఆలోచించక పోవడంవలననో తిండి ఆరోగ్యం విషయాలలో చూపే శ్రద్ధ పిల్లలపై ప్రభావం చూపించే పరిసరాలపై కాని, తమ ప్రవర్తనలపై కాని, చూపడంలో నిర్లక్ష్యం చేస్తారనడం సత్య దూరం కాదనుకొంటాను. ఐతే నేను చెప్పేది చాలామంది తల్లి దండ్రుల విషయంలో మాత్రమే.ఎలా ఉంటే బాగుంటుందో మనం పరిశీలిద్దాం.

ఏ గూటి చిలుక ఆ గూటి పలుకు పలుకుతుందంటారు. మన పిల్లలు మనలాగే మనం గౌరవించే సంప్రదాయాలనే గౌరవిస్తూ, మన మనసుకు నచ్చినట్లుగా ఉండాలనుకొంటే శిశువు జ్ఞానానికి ఆధారమైన మన ప్రవర్తన పిల్లలలో మనం కోరుకొనే సల్లక్షణాలను పెంచేవిగా వుండాలన్న విషయం మనం మరువ కూడదు.

ప్రాతః కాలాన్నే మనం క్రమం తప్ప కుండా లేస్తూ వుండాలి. లేవగానే సృష్టిని దానితో పాటు మననూ నడిపే ఆ పరమాత్మను స్మరించుకోవడమే కాదు. బిగ్గరగా అందరికీ ప్రస్ఫుటమయే విధంగా ప్రార్థన చేయాలి.

కరాగ్రే వసితే లక్ష్మీ
కర మధ్యే సరస్వతీ
కర మూలే స్థితే గౌరీ
ప్రభాతే కర దర్శనం.

అని,, తమ చేతులలోనున్న ముగ్గురమ్మలను చూసుకొని కండ్లకద్దుకొని ప్రార్ధించాలి.

మనము నిదుర లేచినది మొదలు మరల పరుండు వరకూ మనకు ఏ భూమాత ఆహారాదులకు మూలాధారమో ఆ భూ మాతను మన పాదములతో త్రొక్కుతూ జీవిస్తున్నాం. ఈ చర్య అనివార్యం కాబట్టి ఆ తల్లికి మనం నిదుర లేస్తున్నప్పుడే క్షమాపణలు వేడుతూ ప్రార్ధించాలి

విష్ణు పత్నీ మహద్భూతే
శంఖ వర్ణే మహీ తలే
అనేక రత్న సంపన్నే
భూమి దేవీ నమోస్తు తే.

సముద్ర వసనే రమ్యే
పర్వత స్తన మండితే
విష్ణు పత్నీ మహా దేవీ
పాద తాడాం క్షమస్వ మే.

ఈ విధముగా ప్రార్థన చేసి మనం ఆ భూమాతకు నమస్కరించి ఆమెపై మన పాదం మోపాలి.
పిదప మనం అతి పవిత్రంగా భావించే మన దైవ స్థానమైన పూజా మందిరంలోనికి వెళ్ళి మన యింట కొలువై యున్న సకల దేవతలకూ నమస్కరిచాలి.
మనం సంఘంలో సత్ ప్రవర్తనతో మసలుకోవడానికి ఆ దైవాలను నిరంతరం మనకు అండగా నిలిచి, ప్రమాదములకు విరుద్ధంగా మనలను నడపమని ప్రార్థించాలి.
ఈ సమస్థమూ మనల ననుసరించే మన పిల్లలకూ ఉగ్గుపాలతో అలవడేలాగ చేయడానికి మన యీ ప్రవర్తన చాలా ఉపయోగ పడుతుంది. ఈ విషయంలో మనం అశ్రద్ధ చేస్తే ఆ తేడా పిల్లలలో మనం చూడక తప్పదు భవిష్యత్తులో.
ఇంకా యేం చెయ్యాలనే అంశాలను తరువాత అవకాశం చేసుకొని మీముందుంచగలనని విన్నవించుకొనుచున్నాను. ఈ సదవకాశం భగవంతుదు నాకిచ్చినందుకు ఆ పరమాత్మకు శత సహస్రానేక వందనములు. మీ అభిప్రాయాల్ని వినమ్రతతో స్వీకరించగలను.
జైహింద్.

వందే శ్రీ రంగ నాయకీం.

1 comments

సహృదయ పాఠక బంధువులారా! ధనుర్మాస దీక్షా తత్పరులారా! గోదా చరణారవింద సంలగ్న మత్త చిత్తులారా! సచ్ఛీలులారా! అందరికీ ధనుర్మాస శుభారంభం సందర్భంగా అభినందనలు.

లోక కల్యాణాన్నే త్రికరణ శుద్ధిగా కాంక్షించి మనతల్లి గోదాదేవి భయంకరమైన యీ చలి రాత్రులను లెక్ఖ చేయక ప్రాతః కాలముననే దివ్య మంగల స్వరూపుడగు ఆ రంగనాధుని సేవా భాగ్యం తాను పొందుతూ, తోటి వారికీ అందించడం కోసం యెంతగానో శ్రమించింది.
అట్టి ఆ తల్లిని స్మరించే శ్లోకం మనమూ చదువుట ద్వారా ఆ తల్లిని ప్రార్ధిద్దామా!

శ్లోకము:-
కర్కటే పూర్వ ఫల్గున్యాం
తులసీ కాననోద్భవాం
పాండ్యే విశ్వంభరాం గోదాం
వందే శ్రీరంగ నాయకీం.

ఆటవెలది:-
కర్క టాఖ్య మైన అర్క మాసము, పూర్వ
ఫల్గునమున, తులసి వనము లోన,
పాండ్య దేశమందు ప్రభవించినట్టి మా
రంగ నాయకికిని ప్రణుతి సేతు.

ప్రాతః కాలాన్నే మనము ఆ గోదామాతని పై విధంగా ప్రార్ధించడం ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చాలా యోగ్యంగా వుంటుందని నా భావన. మరి మీరేమంటారు?
జైహింద్.

15, డిసెంబర్ 2008, సోమవారం

ఘృత కుంభ సమా నారీ. మేలిమి బంగారం మన సంస్కృతి 33

0 comments

PREVENTION IS BETTER THAN CURE.
ఈ రోజుల్లో మనమాశించని దుస్థితులు మనకు సంభవించకూడదనుకుంటే, మనరక్షణలో నున్న స్త్రీలు రక్షణ వలయంలో వుండాలీ అంటే మనం ఏం చెయ్యాలన్నది మనం గుర్తించాలి కదా!
స్త్రీ పురుషులు పరస్పర ఆకర్షణకు లోనవడం సృష్టి ధర్మం. ఐతే పశువులలాగ కాకుండా మానవులకు కొన్ని కట్టుబాట్లు, విధివిధానాలూ, సంప్రదాయాలూ, నిబంధనలూ ఉన్నాయికదా! ఆ హద్దులను అతిక్రమించకూడదనుకొంటే మనం కొంచెం ఎలర్ట్ గా వుంటూ, ష్ట్రిక్ట్ గా ప్రవర్తించక తప్పదు. ఈ విషయంలో ఓక చక్కని మార్గదర్శకాన్ని సూచిస్తూ శ్లొకమొకటుంది చూడండి.
శ్లో:-
ఘృత కుంభ సమా నారీ
తప్తాగార సమః పుమాన్
తస్మాత్ ఘృతంచ వహ్నించ
నైకత్ర స్థాపయేద్బుధః

ఆ:-పురుషు డగ్ని, " ఘృతము పూబోడి." కావున
ప్రక్క నున్న కరుగు, ప్రబలు నగ్ని.
వరుస చూడ వద్దు. దరిని యుంచగ వద్దు
అన్న చెల్లెల వరు సైన గాని.

భావము:-స్త్రీ నేయి వంటిది. పురుషుడు అగ్ని వంటి వాడు. అగ్ని సమీపమున ఉన్న నేయి కరుగుట, ఆనేయి తగల గానే అగ్ని ప్రబలుట మనకు తెలియనిది కాదు. అదే విధముగా స్త్రీ పురుషులకు ఏకాంతము సంభవించిననూ, పరస్పర స్పర్శ సంభవించిననూ, ప్రకృతి ధర్మాన్ని అధిగమించే సంస్కారము ఎంతున్నా అలాంటి అవకాశం కుదిరినప్పుడు ఊహించని విపరీత పరిణామం సంభవించదని చెప్పగలమా? అందుకే పెద్దలెందుకు చెప్పారో అని గ్రహించి బుధులు తప్పక పాటించాలి.
బలవాన్ ఇంద్రియ గ్రామః.
విద్వాంసమపి కర్షతి.

అన్న ఆర్యోక్తి మనకు తెలియనిది కాదుకదా? కావున పెద్దలం మనం కళ్ళు మూసుకొని వుండడం, ఒకవేళ చూసి కూడా చూడనట్టుండడం, అన్నీ తెలుసుకొని కూడా ఏమీ పట్టనట్టూ, ఊరుకుంటే జరగ రానిదేదైనా కళ్ళ ముందు జరుగుతున్నా అడిగే అధికారాన్ని, నైతిక హక్కునీ కోల్పోతాం. ఇది ముమ్మాటికీ నిజం.
అలాగని చెప్పి ప్రతీ విషయాన్నీ తప్పుగా ఆలోచించమనటం లేదు. ఈవిధంగా చేస్తే నష్టం రాదుకదా అంటున్నాను. మహాకవులు ప్రపంచాన్ని వడబోసి అనుభవ సారాన్ని మనకు శ్లోకరూపంలో నిక్షిప్తం చేసి అందించారు. అవి అందుకో గలగడం మనకున్న గ్రహణ శక్తిని బట్టుంటుంది.
జైహింద్.