గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మార్చి 2025, శుక్రవారం

లింగంపల్లిలో విశ్వావసు ఉగాది వేడుకలలో .....

 

జైశ్రీరామ్.

అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు.

చం.  అనుపములాలపాటికిని, అంజయకున్, మన రామసామికిన్,

ఘనతను గాంచినట్టి కటకంబునకున్, లతకున్ ముదంబుగా

ఘనకవితామృతంబు నిట గానముచేగనున్న మీకు నీ

ఘనులగుహాస్య లోలునకు గౌరవమొప్ప నమస్కరించెదన్.


శా.  శ్రీమన్మంగళ వేంకటేశుని కృపన్ శ్రీమంత వాసంతితో

ప్రేమన్ భక్తులఁ గావ నెంచి విలసద్ విశ్వాసన్ బేరుతో

ధీమంతుల్ కవిపండితుల్ పొగడగా దేదీప్యమానంబుగా

శ్రీమంతంబుగ వచ్చుచుండె  కనుడీ చేయెత్తి జై కొట్టుడీ.


శా.  రామస్వామి మనోజ్ఞ భావన లిటన్ రాణింపగా వేదికన్

శ్రీమన్మంగళ సత్కవీంద్రులిచటన్ శ్రేయోభిరామమ్ముగా

ప్రేమన్ స్వాగత హృద్యపద్యములలో విశ్వావసున్ గొల్చుటన్

క్షేమంబున్ గలిగించు దేశమునకున్ శ్రీనాథుఁ డీ ధాత్రికిన్.


16. చం. జయములు పొందుడంచు పిక జాలము కూ యని కూయసాగ, ది

గ్జయములతోడ వెల్గుడని గట్టిగ దిక్కులు మారు మ్రోగెనే

నియతినిగల్గి మానవులు నిర్భర భక్తిని కల్గియుండి, ని

శ్చయముగ మంగళాత్ములయి చక్కగ వృద్ధిని పొందు గావుతన్.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.