జైశ్రీరామ్.
శ్లో. అమృతం సద్గుణా భార్యా - అమృతం బాలభాషితం
అమృతం రాజసమ్మానం - అమృతం మానభోజనమ్.
తే.గీ. భార్య గుణవతి యమృతంబు భర్తకెపుడు,
బాలభాషణమృతంబు పద్మనాభ!
రాజ సన్మానమమృతంబు పూజ్యులకును,
పరిమితాహారమమృతము భక్తవరద!
భావము. మంచిగుణం గలదైన భార్య అమృతం వంటిది. చిన్నపిల్లల
ముద్దుమాటలు అమృతసమాన మైనవి. రాజు వల్ల గౌరవం పొందడం
అమృతంతో సమానం. కొలత ప్రకారం పరిమితంగా చేసే భోజనం
అమృతం వంటిది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.