గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, మార్చి 2025, సోమవారం

అనభ్యాసే విషం శాస్త్రమ్ ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  అనభ్యాసే విషం శాస్త్ర మజీర్ణే భోజనం విషమ్ । 

మూర్ఖస్య చ విషం గోష్ఠీ వృద్ధస్య తరుణీ విషమ్ ॥ 

తే.గీ.  విద్య విషమిల నభ్యాసవిహితునకును,

అగ్నిమాంద్యునకన్నమే యగును విషము,

మూర్ఖునకు గోష్టి విషమిలన్ బూజ్యులార!

యువతి విషమగు ముదిమికి నోపలేక.

భావము. అభ్యసము చేయని వానికి శాస్త్రము విషతుల్యము. అజీర్ణముగా 

ఉన్నవానికి భోజనం విషతుల్యము. మూర్ఖునికి విద్యాగోష్ఠి విషతుల్యము. 

ముసలివానికి యువతి విషతుల్యము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.