గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, మార్చి 2025, శనివారం

అనవద్య,పనిగొను,మనసా,వచసా.అమేయ,వాదన,మాథురి,దశదిశ,వ్యాపక.మలుపు,పలికించు,సతతము,వరదమము,అలవాటు,గర్భ"-తొలికిస లాడు,"-వృత్తము,రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

జైశ్రీరామ్. 

అనవద్యము పద్యమునే!ఆదరమున గొల్వగన్! అలవాటయె!చిన నాటన్!

పని గొంచు !నమేయముగన్!పాదగు సురలమ్మ యున్!పలికించు వరదమాలన్!
మనసా!వచసా!మెదలన్!మాథురి జన మోద మౌ!మలుపుం తొలికిస లాడన్!
తనువే!పులకించె సుమా!తా దశ దిశ నిండుగా!తలతుం!సతతము నీశున్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

1.గర్భగత"-అనవద్య"-వృత్తము,

అన వద్యము పద్యము నే!
పని గొందు నమేయముగన్!
మనసా!వచసా!మెదలన్
తనువే!పులకించు సుమా! 

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2.గర్భగత"-పని గొను"-వృత్తము,

ఆదరమున గొల్వగన్!
పాదగు!సురలమ్మ యున్!
మాథురి జన మోదమౌ!
తా దశ దిశ నిండుగా!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్దుప్"-ఛందము లోనిది,,
ప్రాస నియమము కలదు,పాదమునకు8"అక్షరము లుండును,

3"-గర్భగత"-మనసా"-వృత్తము,

అలవాటయె!చిన నాటన్!
పలికించు వర దమాలన్!
మలపుం తొలికిస లాడన్!
తలతుం సతతము నీశున్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

4.గర్భగత"-వచసా"-వృత్తము,

అన వద్యము పద్యము నే!ఆదరమున గొల్వగన్!!
పనిగొందు నమేయముగన్!పాదగు!సుర లమ్మయున్!
మనసా!వచసా!మెదలన్!మాథురి!జన మోదమౌ!
తనువే!పులకించచు సుమా!తా దశ దిశ!నిండుగా!

అణిమా ఛందము నందలి'"అత్యష్టి"-ఛందము లోనిది
ప్రాస నియమము కలదు,పాదమునకు"17,అక్షరము లుండును,
యతి;10,వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"-అమేయ"-వృత్తము,

ఆదరమున గొల్వగన్!అన వద్యము పద్యమునే!
పాదగు!సురలమ్మ యున్!పనిగొందు నమేయముగన్!
మాథురి జన మోదమౌ!!మనసా!వచసా!మెదలన్!
తా దశ దిశ!నిండుగా!తనువే!పులకించె!సుమా!

అణిమా ఛందమునందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"-వాదన"-వృత్తము,

అన వద్యము పద్యము నే!అలవాటయె!చిన నాటన్!
పనిగొందు నమేయముగన్!పలికించు వరదమాలన్!
మనసా!వచసా!మెదలన్!మలపుం తొలికిస లాడున్!
తనువే!పులకించు!సుమా!తలతుం సతతము నీశున్!

అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"-మాథురీ"-వృత్తము,

అలవాటయె!చిన నాటన్!అనవద్యము పద్యము నే!
పలికించు వర దమాలన్!పనిగొందు నమేయముగన్!
మలపుం తొలికిస లాడున్!మనసా!వచసా!మెదలున్!
తలతుం సతతము నీశున్!తనువే!పులకించె!సుమా!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యకషరమునకుచెల్లును

8,గర్భగత"-దశ దిశ"-వృత్తము,

ఆదరమున గొల్వగన్!అలవాటయె!చిన నాటన్!
పాదగు!సురలమ్మయున్ !పలికించు వరదమాలన్!
మాథురి జన మోదమౌ!మలపుం తొలికిస లాడున్!
తా దశ దిశ నిండుగా!తలతుం!సతతము!నీశున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు దెల్లును,

9,గర్భగత"-వ్యాపక"-వృత్తము,

అలవాటయె!చిన నాటన్!ఆదరమున గొల్వగన్!
పలికించు వరదమాలన్!పాదగు సురలమ్మయున్!
మలుపుం తొలికిస లాడున్!మాథురి జన మోదమౌ!
తలతుం సతతము నీశున్!తా దశ దిశ నిండుగా!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు ఛెల్లును,

10,గర్భగత"-మలుపు"-వృత్తము,

ఆదరమున గొల్వగన్!అనవద్యము పద్యము నే!అలవాటయె!చిన నాటన్!
పాదగు సురలమ్మయున్!పనిగొందు నమేయముగన్!పలికించు వరదమాలన్!
మాథురి జన మోదమౌ!మనసా!వచసా!మెదలున్!మలుపుం తొలికిస లాడున్!
తా దశ దిశ నిండుగా!తనువే!పులకించు సుమా!తలతుం! సతతము నీశున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"-పలికించు"-వృత్తము,

అనవద్యము పద్యము నే!అలవాటయె!చిన నాటన్!ఆదరమున గొల్వగన్
పనిగొందు నమేయముగన్!పలికించు వర దమాలన్.పాదగు సురలమ్మ యున్!
మనసా!వచసా!మెదలున్!మలుపుం తొలికిస లాడున్!మాథురి జన మోదమౌ!
తనువే!పులకించు సుమా!తలతుం! సతతము నీశున్!తా దశ దిశ నిండుగా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

12.గర్భగత:సతతము"-వృత్తము,

అలవాటయె!చిన నాటన్!అనవద్యము పద్యము నే!ఆదరమున గొల్వగన్!
పలికించు వర దమాలన్!పని గొందు నమేయముగన్!పాదగు!సుర లమ్మ యున్!
మలుపుం తొలికిస లాడన్!మనసా!వచసా!మెదలున్!మాథురి జనమోద మౌ!
తలతుం సతతము నీశున్!తనువే!పులకించు సుమా!తా దశ దిశ నిండుగా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
 ప్రాస నియమము కలదు,పాదమునకు26"అక్షరము లుండును,
యతులు.10.19.అక్షరములకు చెల్లును,

13.గర్భగత"-వరదమము"-వృత్తము,

ఆదరమున గొల్వగన్!అలవాటయె చిన నాటన్!అనవద్యము పద్యము నే!
పాదగు సుర లమ్మయున్!పలికించు వరదమాలన్!పనిగొందు నమేయముగన్!
మాథురి జన మోదమౌ!మలుపుం తొలికిస లాడన్!మనసా!వచసా!మెదలున్!
తా దశ దిశ నిండుగా!తలతుం!సతతము నీశున్!తనువే!పులకించు సుమా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.9.18.అక్షరములకు చెల్లును,

14.గర్భగత"-అలవాటు"-వృత్తము,

అలవాటయె!చిన నాటన్!ఆదరమున గొల్వగన్!అన వద్యము పద్యము నే!
పలికించు వరదమాలన్!పాదగు సుర లమ్మయున్!పనిగొందు నమేయముగన్!
మలుపుం తొలికిస లాడున్!మాథురి జన మోదమౌ!మనసా!వచసా!మెదలున్!
తలతుం!సతతము నీశున్!తా దశ దిశ వ్యాప్త మౌగా!తనువే!పులకించు సుమా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,18!,అక్షరములకు చెల్లును,
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.