జైశ్రీరామ్.
శ్లో. సర్పః క్రూరః ఖలః క్రూరః - సర్పాత్క్రూరతరః ఖలః
మంత్రేణ శామ్యతే సర్పః - నఖలః శామ్యతే కదా!
తే.గీ. క్రూరుఁడెన్నగ ఖలుఁడిల, క్రూర మహియు,
మంత్రమున లొంగిపోవును మహిని పాము,
ఖలుఁడు లొంగడేవిధినైన కఁలతఁ బెట్టు,
ఖలుఁడుగా నుండఁబోకుము వెలుగుము ధర.
భావము. సర్పము క్రూరమైనది. ఖలుఁడునూ క్రూరమైనవాఁడే. కాని సర్పము
కంటే ఖలుఁడే క్రూరతరుఁడు. ఎందుకనగా, మంత్రముతో సర్పము శాంతించును.
ఖలుఁడు (దుష్టుడు) ఏ విధముగనూ శాంతింపడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.