గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, మార్చి 2025, శనివారం

కొనియాడు,దవళ తేజం.స్వర్గం!కౌతుకం.త్రాతే దాత.కీర్తించు,శాంతం.మోక్షము,నీతీ నీమం,ఘన కీర్తి,తోడూ నీడ,కువలయం.జీవన సత్యం.ధర్మ మార్గం,గర్భ"-నీతే ము రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,ఖ్యం"-వృత్తము,

జైశ్రీరామ్.

 నిను వీడని నీడే!దైవమ్!నివురు గప్పిన నిప్పే!నీతే!సత్యం ధర్మం బిలలోన్!

తన ధర్మమె!తోడై నిల్చున్!ధవళ తేజమె!శాంతమ్!త్రాతే!దాతై కీర్తింప బడున్!
కొని యాడుమి నీతీ నీమం!కువలయం బదె!స్వర్గమ్!కౌతూహ్యంబే!సర్వేశ్వరమౌ!
చను మంచి నదే!మోక్షం!జవ మశాశ్వత మింతే!జాతీ నీతే!ముఖ్యం బవనిన్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"-
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు "26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

1.గర్భగత"-కొనియాడు"-వృత్తము,

నిను వీడని నీడే!దైవమ్!
తన ధర్మమె!తోడై నిల్చున్!
కొనియాడుమి నీతీ నీమమ్!
చను మంచి నదే!మోక్షమ్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2.గర్భగత"-ధవళ తేజ"-వృత్తము,

నివురు గప్పిన నిప్పే!
ధవళ తేజమె!శాంతమ్!
కువలయం బదె!స్వర్గమ్!
జవ మశాశ్వత  మింతే!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,8,అక్షరము లుండును,

3.గర్భగత"-స్వర్గం"-వృత్తము,

నీతే!సత్యం!ధర్మం బిలలోన్!
త్రాతే!దాతై కీర్తింప బడున్!
కౌతూహ్యంబే!సర్వేశ్వరమౌ!
జాతీ నీతే!ముఖ్యం బవనిన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

4.గర్భగత"-కౌతుకం"-వృత్తము,

నిను వీడని నీడే!దైవమ్!నివురు గప్పిన నిప్పే!
తన ధర్మమె!తోడై నిల్చున్!ధవళ తేజమె!శాంతమ్!
కొని యాడుమి నీతీ నీమం!కువలయం బదె!స్వర్గమ్!
చను మంచి!నదే!మోక్షం!జవ మశాశ్వత మింతే!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,17,అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత:-త్రాతే దాత"-వృత్తము,

నివురు గప్పిన నిప్పే!నిను వీడని నీడే!దైవమ్!
ధవళ తేజమె!శాంతం!తన ధర్మమె తోడై నిల్చున్!
కువలయం బదె!స్వర్గం!కొని యాడుమి!నీతీ!నీమమ్!
జవ మశాశ్వత మింతే!చను మంచి నదే!మోక్షమ్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,9,వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"-కీర్తించు"-వృత్తము,

నిను వీడని నీడే!దైవం!నీతే!సత్యం!ధర్మం బిలలోన్!
తన ధర్మమె తోడై నిల్చుం!త్రాతే!దాతై!కీర్తింప బడున్!
కొనియాడుమి!నీతీ నీమం!కౌతూహ్యంబే!సర్వేశ్వర మౌ!
చను మంచి నదే!మోక్షం!జాతీ నీతే!ముఖ్యం బవనిన్!

అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి''10,వ యక్షరమునకు చెల్లును,

7,గర్భగత"-శాంతం"-వృత్తము,

నీతే!సత్యం!ధర్మం బిలలోన్!నిను వీడని నీడే!దైవమ్!
త్రాతే!దాతై!కీర్తింప బడున్!తన ధర్మ మె తోడై నిల్చున్!
కౌతూహ్యంబే!సర్వేశ్వరమౌ!కొనియాడుమి!నీతీ!నీమమ్!
జాతీ!నీతే!ముఖ్యం బవనిన్!చను మంచి!నదే!మోక్షమ్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

8,గర్భగత"-మోక్షము"-వృత్తము,

నివురు గప్పిన నిప్పే!నీతే!సత్యం!ధర్మం బిలలోన్!
ధవళ తేజమె!శాంతం!త్రాతే!దాతై కీర్తింప బడున్!
కువలయంబదె!స్వర్గం!కౌతూహ్యంబే!సర్వేశ్వరమౌ!
జవ మశాశ్వత!మింతే!జాతీ!నీతే!ముఖ్యం బవనిన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరములుండును,
యతి"9,వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"-నీతీ నీమం"-వృత్తము,

నీతే!సత్యం!ధర్మం బిలలోన్!నివురు గప్పిన నిప్పే!
త్రాతే!దాతై!కీర్తింప బడుని!ధవళ తేజమె!శాంతమ్!
కౌతూహ్యంబే!సర్వేశ్వరమౌ!కువలయం బదె!స్వర్గమ్!
జాతీ నీతే!ముఖ్యం బవనిన్!జవ మశాశ్వత మింతే!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత"-ఘన కీర్తి"-వృత్తము,

నివురు గప్పిన నిప్పే!నిను వీడని నీడే!దైవం!నీతే!సత్యం!ధర్మం బిల లోన్!
ధవళ తేజమె!శాంతం!తన ధర్మమె!తోడై!నిల్చున్!త్రాతే!దాతై !కీర్తింప బడున్!
కువలయంబదె!స్వర్గం!కొనియాడుమి నీతీ!నీమం!కౌతూహ్యంబే!సర్వేశ్వరమౌ!
జవ మశాశ్వత మింతే!చను మంచి నదే!మోక్షం!జాతీ!నీతే! ముఖ్యం బవనిన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"-తోడూ నీడ"-వృత్తము,

నిను వీడని నీడే!దైవం!నీతే!సత్యం!ధర్మం బిలలోన్!నివురు గప్పిన నిప్పే!
తన ధర్మమె తోడై నిల్చున్!త్రాతే!దాతై కీర్తింప బడున్!ధవళ తేజమె!శాంతమ్!
కొనియాడుమి!నీతీ!నీమం!కౌతూహ్యంబే!సర్వేశ్వరమౌ!కువలయం బదె!స్వర్గమ్!
చను మంచి నదే మోక్షం!జాతీ!నీతే!ముఖ్యం బవనిన్!జవ మశాశ్వత మింతే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"-కువలయం"-వృత్తము,

నీతే!సత్యం!ధర్మం బిలలోన్!నిను వీడని నీడే!దైవం!నివురు గప్పిన నిప్పే!
త్రాతే!దాతై!కీర్తింప బడున్!తన ధర్మమె!తోడై నిల్చున్!ధవళ తేజమె!శాంతమ్!
కౌతూహ్యంబే!సర్వేశ్వరమౌ!కొనియాడుమి!నీతీ నీమం!కువలయం బదె!స్వర్గమ్!
జాతీ!నీతే!ముఖ్యం!బవనిన్!చను మంచి నదే!మోక్షం!జవ మశాశ్వత మింతే!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"-జీవన సత్యం"-వృత్తము,

నివురు గప్పిన నిప్పే!నీతే!సత్యం!ధర్మం బిలలోన్!నిను వీడని నీడే!దైవమ్!
ధవళ తేజమె!శాంతం!త్రాతే!దాతై!కీర్తింప బడున్!తన ధర్మమె!తోడై!నిల్చున్!
కువలయంబదె!స్వర్గం!కౌతూహ్యంబే!సర్వేశ్వరమౌ!కొనియాడుమి!నీతీ!నీమమ్!
జవ మశాశ్వత మింతే!జాతీ నీతే!ముఖ్యం బవనిం!చను మంచి!నదే!మోక్షమ్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"-ధర్మ మార్గం"-వృత్తము,

నీతే!సత్యం!ధర్మం బిలలోన్!నివురు గప్పిన నిప్పే!నిను వీడని నీడే!దైవమ్!
త్రాతే!దాతై!కీర్తింప బడున్!ధవళ తేజమె!శాంతం!తన ధర్మమె!తోడై నిల్చున్!
కౌతూహ్యంబే!సర్వేశ్వరమౌ!కువలయం బదె!స్వర్గం!కొనుయాడుమి!నీతీ నీమమ్!
జాతీ నీతే ముఖ్యం బవనిం!జవ మశాశ్వత మింతే!చను మంచి!నదే!మోక్షమ్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.