గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జూన్ 2024, శనివారం

స్థిరములు కావు కావు...కరుణ శ్రీ. sthiramulu kavu kaavu అమర్ ఖయాం.amarkhayam

జైశ్రీరామ్.
కాకి నిత్యమూ మనకు చక్కని నగ్న సత్యాన్ని ఉద్బోధ చేస్తూనే ఉంటుంది. ఐనా మనము గ్రహించలేకపోవుట మన దురదృష్టము. అదెలాగంటారా ఇది గో చూడండి. మన కరుణశ్రీ మహాకవి  ఆ రహస్య సందేశాన్ని విడమరచి ఉత్పలమాలలో ఎలా చెప్పారో ఏవీ స్థిరములు కావు.

 స్థిరములు "కావు కావు" చల జీవితముల్ సిరి సంపదl సుఖం 

కరములు "కావు కావు"; పలు గద్దెలు మిద్దెలు) నాత్మ శాంతికా

కరములు "కావు కావు"; నవకమ్ములు నిత్యము"కావు కా";వటం 

చరచుచునుండె కాకి; కను మల్లదిగో బహరాము గోరిపై!!

అమర్ ఖయాం కరుణశ్రీ. 

జైహింద్.

Rephrase with Ginger (Ctrl+Alt+E)
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.