గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జూన్ 2024, ఆదివారం

వాదులాడు,నుతిగను,భాష్యతా,సమ సామ్య,జ్ఞానసుధ,లోక మెప్పు, గర్భ"జ్ఞానాంబుధె"వృత్తము,రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

 జైశ్రీరామ్.

పెడతల పెట్ట బోకుమా!వినుతాగ్రణి మాటలు!వేద భాష గుప్తార్ధములన్!
విడు వడు జీవ మిద్ధరన్!వెను కేగకు నీతుల!పేద రక్ష దక్షాద్యములన్!
గొడ వడ బోకు మన్యులన్!కొనుమా సమ సామ్యము!క్రోధ దూర విజ్ఞాన సుధన్!
నిడు నడు నీతి మార్గమున్!నిను మెచ్చును లోకము!నీదులాడు జ్ఞానాంబుధినిన్!

పెడతల=విననితనం,విడువడు=విడుచు,గొడ వడ=తగాదా పడగ,నిడు నడు=
నిటారుగా(ముక్కు సూటెగా)చరించు

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

1,గర్భగత"పెడతల"వృత్తము,

పెడ తల పెట్ట బోకుమా!
విడు వడు జీవ మిద్ధరన్!
గొడ వడ బోకు మన్యులన్!
నిడు నడు నీతి మార్గమున్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"చందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2.గర్భగత"విడు వడు"వృత్తము,

వినుతాగ్రణి మాటలు!
వెను కేగకు నీతుల!
కొనుమా సమ సామ్యము
నిను మెచ్చును లోకము ! 

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,

3,గర్భగత"గొడ వడ"వృత్తము,

వేద భాష గుప్తార్ధములన్!
పేద రక్ష దక్షాద్యములన్!
క్రోధ దూర విజ్ఞాన సుధన్!
నీధులాడు జ్ఞానాంబుధినిన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

4.గర్భగత"నిడు నడు"వృత్తము,

పెడతల పెట్ట బోకుమా!వినుతాగ్రణి మాటలు,
విడు వడు జీవ మిద్ధరన్!వెను కేగకు నీతుల!
గొడ పడ బోకు మన్యులన్!కొనుమా సమ సామ్యము!
నిడు నడు నీతి మార్గమున్!నిను మెచ్చును లోకము,

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,10"వ యక్షరమునకు చెల్లును,

5,గర్భగత"వినుత"వృత్తము,

వినుతాగ్రణి మాటలు!పెడతల పెట్ట లోకుమా!
వెను కేగకు నీతిని!విడువడు జీవ మిద్ధరన్!
కొనుమా సమ సామ్యము!గొడ వడ లోకు మన్యులన్!
నిను మెచ్చును లోకము!నిడు నడు నీతి మార్గమున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి9"వ యక్షరమునకు చెల్లును,

6,గర్భగత"వేదము"వృత్తము,

పెడతల పెట్ట బోకుమా!వేద భాష గుప్తార్ధములన్!
విడువడు జీవ మిద్ధరన్!పేద రక్ష దక్షాద్యములన్!
గొడ వడ బోకు మన్యులన్!క్రోధ దూర విజ్ఞాన సుధన్!
నిడు నడు నీతి మార్గమున్!నీదులాడు జ్ఞానాంబుధినిన్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

7,గర్భగత"కొనుమా"వృత్తము,

వేద భాష గుప్తార్ధములన్!పెడతల పెట్ట బోకుమా!!
 పేద రక్షదక్షాద్యములన్!విడు వడు జీవ మిద్ధరన్!
క్రోధ దూర విజ్ఞాన సుధన్!గొడ వడ బోకు మన్యులన్!
నీదు లాడ జ్ఞూనాంబుధినిన్!నిడు నడు నీతి మార్గమున్!

అణిమా ఛందము నందలి"ధృతి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"పేదరక్ష,"వృత్తము,

వినుతాగ్రణి మాటలు!వేద భాష గుప్తార్ధములన్!
వెను కేగకు నీతుల!పేద రక్ష దక్షాద్యములన్!
కొనుమా సమ సామ్యము!క్రోధ దూర విజ్ఞాన సుధన్!
నిను మెచ్చును లోకము!నీదు లాడు జ్ఞానాంబుధినిన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,9,వ యక్షరమునకు చెల్లును,

9.గర్భగత"నీదులాడు"వృత్తము,

వేద భాష గుప్తార్ధములన్!వినుతాగ్రణి మాటలు!
పేద రక్ష దక్షా ద్యములన్! వెను కేగకు నీతి మార్గము!
క్రోధ దూర విజ్ఞాన సుధన్!కొనుమా సమ సామ్యము!
నీదు లాడు జ్ఞానాంబుధినిన్!నిను మెచ్చును లోకము!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును,
యతి.10,వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత"నుతి గను"వృత్తము,

వినుతాగ్రణి మాటలు!పెడ తల పెట్ట బోకుమ!వేద భాష గుప్తార్ధములన్!
వెను కేగకు నీతుల!విడు వడు జీవ మిద్ధరన్!పేద రక్ష దక్షాద్యములన్!
కొనుమా సమ సామ్యఘు!గొడ వడ బోకు మన్యులన్!క్రోధ దూర విజ్ఞాన సుధన్!
నిను మెచ్చును లోకము!నిడు నడు నీతి మార్గమున్!నీదు లాడు జ్ఞానాంబుధినిన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు9,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"భాష్యతా"వృత్తము,

పెడతల పెట్ట బోకుమా!వేద భాష గుప్తార్ధములన్!విను తాగ్రణి మాటలు!
విడువడు జీవ మిద్ధరన్!పేద రక్ష దక్షాద్యములన్!వెను కేగకు నీతుల!
గొడ వడ బోకు మన్యులన్!క్రోధ దూర విజ్ఞాన సుధన్!కొనుమా సమ సామ్యము!
నిడు నడు నీతి మార్గమున్!నీదులాడు జ్ఞానాంబుధినిన్!నిను మెచ్చును లోకము!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,19,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"సమసామ్య"వృత్తము,

వినుతాగ్రణి మాటలు!వేద భాష గుప్తార్ధములన్!పెడతల పెట్టబోకుమా!
వెను కేగకు నీతుల!పేద రక్ష దక్షాద్యములన్!విడువడు జీవ మిద్ధరన్!
కొనుమా సమ సామ్యము!క్రోధ దూర విజ్ఞాన సుధన్!గొడ వడబోకు మన్యులన్!
నిను మెచ్చును లోకము!నీదు లాడు జ్ఞానాంబుధినిన్!నిడు నడు నీతి మార్గమున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

13,గర్భగత"జ్ఞానసుధ"వృత్తము,

వేదభాష గుప్తార్ధములన్!పెడతల పెట్ట బోకుమా!వినుతాగ్రణి మాటలు!
పేద రక్ష దక్షాద్యములన్!విడు వడు జీవ మిద్ధరన్!వెను కేగకు నీతుల!
క్రోధదూర విజ్ఞాన సుధన్!గొడ వడ బోకు మన్యులన్!కొనుమా సమ సామ్యము!
నీదులాడు జ్ఞానాంబుధినిన్!నిడు నడు నీతి మార్గమున్!నిను మెచ్చును లోకము!

అనిరుద్ఛందము నందలి'ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెందును,

14.గర్భగత"లోకమెప్పు"వృత్తము,

వేద భాష గుప్తార్ధములన్!వినుతాగ్రణి మాటలు!పెడచల పెట్ట బోకుమా!
పేద రక్ష దక్షాద్యములన్!వెను కేగకు నీతుల!విడు వడు జీవ మిద్ధరన్!
క్రోధ దూర విజ్ఞాన సుధన్!కొనుమా సమ సామ్యము!గొడ వడ బోకు మన్యులన్!
నీదులాడు జ్ఞానాంబుధినిన్!నిను మెచ్చును లోకము!నిడు నడు నీతి మార్గమున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"10,18,అక్షరములకు చెల్లును,

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.