జైశ్రీరామ్.
సొమ్ము వలన సొమ్ము చేత!సొమ్ము కోరి సొమ్మసిలన్!చూడ స్వేచ్ఛ తీరదందురే!
భమ్ము లలమ కమ్మ నంచు!వమ్ము మాట లాడ భళెం!పాడి యౌనె దోష చర్యలున్!
అమ్ము లలమి కుమ్మె చూడ!అమ్మకాని కెంచి రిలన్!ఆడు ఆట పాడు పాటయెన్!
నెమ్మొగమది కాంతి బాసె!నిమ్మళంబు లేదు గనన్!నీడ లేని జీవ మాయెనే!
సృజనాత్మక గర్భ కవితా ఛందము నందలి,అనిరుద్ఛందాంతర్గత"ఋఉత్కృ తి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
1,గర్భగత"భమ్ముల వృత్తము,
సొమ్ము వలన సొమ్ము చేత!
భమ్ము లలమ కమ్మ నంచు!
అమ్ము లలమి కమ్మె చూడ!
నెమ్మొగమది కాంతి బాసె!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,
2.గర్భగత"సొమ్ముల"వృత్తము,
సొమ్ము కోరి సొమ్మసిలన్!
వమ్ము మాట లాడ భళెన్!
అమ్మకాని కెంచి రిలన్!
నిమ్మళంబు లేదు గనగన్!
అభిజ్ఞా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు8"అక్షరము లుండడును,
3.గర్భగత"అమ్ములు వృత్తము,
చూడ స్వీచ్ఛ తీరదందురీ?
పాడి యౌనె ?దోష చర్యలున్!
ఆఢు ఆట పాడు పాటయెన్!
నీడ లేని జీవ మాయెనే!
అభిజ్ఞా ఛందము నంధలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును,
4.గర్భగత"సొమ్ము కోరు"వృత్తము,
సొమ్ము వలన సొమ్ము చేత!సొమ్ము గోరి సొమ్మసిలన్!
భమ్ము లలమ కమ్మ నంచు!వమ్ము మాట లాడ భళెన్!
అమ్ము లలమి కమ్మె చూడ!అమ్మకాని కెంచి రిలన్?
నెమ్మొగమున కాంతి బాసె!నిమ్మళంబు లేదు గనన్?
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు'17"అక్షరము లుండును,
యతి"10:"వ యక్షరమునకు చెల్లును,
5.గర్భగత"సొమ్ము వలన"వృత్తము,
సొమ్ము గోరి సొమ్మ సిలన్!సుమ్ము వలన సొమ్ము చేత!
వమ్ము మాట లాడ భళెన్!భమ్ము లలమ కమ్మ నంచు!
అమ్మకాని కెంచి రిలన్?అమ్ము లలమి కమ్మె చూడ!
నిమ్మళంబు లేదు గనన్?నెమ్మొగమున కాంతి బాసె!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ య్షక్షరమునకు చెల్లును,
6,గర్భగత"సొమ్ము చేత"వృత్తము,
సొమ్ము వలన సొమ్ము చేత!చూడ స్వేచ్ఛ తీరదందురే?
వమ్ము మాట లాడ భళెం!పాడి యౌనె?దోష చర్యలున్!
అమ్ము లలమి కుమ్మె చూడ!ఆడు ఆట పాడు పాటయెన్!.
నెమ్మొగ మది కాంతి బాసె!నీడ లేని జీవమాయెనే!
అణిమా ఛందము నందలి"-ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
7,గర్భగత"కుమ్మగ"వృత్తము,
చూడ స్వీచ్ఛ తీరదందురే?సొమ్ము వలన సొమ్ము చేత!
పాడి యౌనె?దోష చర్యలున్!వమ్ము మాటలాడ భళెన్!
ఆడు ఆట పాడు పాటయెన్!అమ్ము లలమికుమ్మె చూడ!
నీడ లేని జీవ మాయెనే!నెమ్మొగమది కాంతి బాసె!
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియనియమము కలదు,పాదమునకు18"అక్షరము లుండును,
యతి10"వ యక్షరమునకు చెల్లును,
8.గర్భగత"అలము కొనె"వృత్తము,
సొమ్ము కోరి సొమ్మ సిలెన్!చూడ స్వేచ్ఛ తీరదందురే?
వమ్ము మాట లాడ భళెన్!పాడి యౌనె?దోష చర్యలున్!
అమ్మ కాని కెంచి రిలన్!ఆడు ఆట పాడు పాటయెన్!
నిమ్మళంబు లేదు గనన్?నీడ లేని జీవ మాయెనే!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,9,వ యక్షరమునకు చెల్లును,
9,గర్భగత"నెమ్మోము"వృత్తము,
చూడ స్వీచ్ఛ తీరదందురే?సొమ్ము కోరి సొమ్మసిలెన్!
పాడి యౌనె?దోష చర్యలున్!వమ్ము మాటలాడ భళెన్!
ఆడు ఆట పాడు పాటయెన్!అమ్మకాని కెంచి రిలన్ ?
నీడ లేని జీవ మాయెననే!ని మ్మళంబు లేదు గనన్?
అణిమా ఛందము నందలి"అత్యష్టి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు17"అక్షరము లుండును,
యతి10,వ యక్షరమునకు చెల్లును,
10,గర్భగత"కమ్మని"వృత్తము,
సొమ్ము కోరి సొమ్మ సిలెన్!సొమ్ము వలన సొమ్ము చేత!చూడ స్వీచ్ఛ తీరదందురే?
వమ్ము మాట లాడ భళెం!బమ్ము లలమ కమ్మ నంచు!పాడి యౌనె?దోష చర్యలున్!
అమ్మకాని కెంచి రిలన్?అమ్ము లలమి కుమ్మె చూడ!ఆడు ఆట పాడు పాటయెన్!
నిమ్మళంబు లేదు గనన్?నెమ్మొగమది కాంతి బాసె!నీడ లేని జీవ మాయెనే!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరము లకు చెల్లును,
11.గర్భగత "సొమ్మ సెలి"వృత్తము,
సొమ్ము వలన సొమ్ము చేత! చూడ స్వేచ్ఛ తీరదురే? సొమ్ము కోరి సొమ్మ సిలెన్!
బమ్ము లలమ కమ్మనంచు!పాడి యౌనె?దోష చర్యలున్!వమ్ము మాట లాడ భళెన్!
అమ్ము లలమి కుమ్మె చూడ! ఆడు ఆట పాడు పాటయెన్!అమ్మకాని కెంచి రిలన్?
నెమ్మొగమది కాంతి బాసె!నీడ లేని జీవ మాయెనే!నిమ్మళంబు లేదు గనన్?
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి'ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"10,18,అక్షరములకు చెల్లును,
12.గర్భగత"తీరది"వృత్తము,
చూడ స్వేచ్ఛ తీరదందురే?సొమ్ము వలన సొమ్ము చేత!సొమ్ము కోరి సొమ్మసిలెన్!
పాడి యౌనె? దోష చర్యలున్!బమ్ము లలమ కమ్మ నంచు!వమ్ము మాట లాడ భళెన్!
ఆడు ఆట పాడు పాటయెన్!అమ్ము లలమి కుమ్మె చూడ!అమ్మకాని కెంచి రిలన్?
నీడ లేని జీవ మాయెనే!నెమ్మొగ మది కాంతి బాసె!నిమ్మళంబు లేదు గనన్?
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు 26"అక్షరము లండును,
యతులు,10,19,అక్షరము లకు చెల్లును,
13,గర్భగత"దోషిత"వృత్తము,
సొమ్ము కోరి సొమ్మసిలెన్!సొమ్ము వలన సొమ్ము చేత!చూడ స్వేచ్ఛ తీరదందురీ?
వమ్ము మాట లాడ భళెన్!బమ్ము లలమ కమ్మ నంచు!పాడి యౌనె?దోష చర్యలున్!
అమ్మ కాని కెంచి రిలన్?అమ్ము లలమి కుమ్మె చూడ!ఆడు ఆట పాడు పాటయెన్!
నిమ్మళంబు లేదు గనన్?నెమ్మొగమది కాంతి బాసె!నీడ లేని జీవ మాయెనే!
అనిరుద్ఛందము నందలి"ఉచ్కృతి "ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"9,18,అక్షరము లుండును,
14,గర్భగత"చీడ విడు"వృత్తము,
చూడ స్వేచ్ఛ తీరదందురే?సొమ్ము.కోరె సొమ్మసిలెన్!సొమ్ము వలన సొమ్ము చేత!
పాడి యౌనె?దోష చర్యలున్!వమ్ము మాట లాడ భళెన్!బమ్ము లలమ కమ్మనంచు!
ఆడు ఆట పాడు పాటయెన్!అమ్మకాని కెంచి రిలన్?అమ్ము లలమి కమ్మె చూడ!
నీడ లేని జీవ మాయెనే!నిమ్మళంబు లేదు గనన్?నెమ్మొగమది కాంతి బాసె!
అని రుద్ఛందము నందలి"ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"10,18,అక్షరము లకు చెల్లును,
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.