జైశ్రీరామ్.
వేదాంత దేశికులవారి అపునర్యుక్త వ్యంజనం. "చిత్రపద్ధతి" శ్లోకమ్.
శ్లో. బాఢాఘాళీ ఝాటతుచ్చే గాధాభానా యపుల్లఖే |
సమాధిశఠ జిచ్చూడాం వృణోషి హరి పాదుకే ||
వివరణ.
ఓ భగవత్పాదుకా, దృఢమైన పాప సముదాయ మనే అడవి లేనట్టి, వికసించిన
మనస్సు గల సమాధి యోగ మందు దివ్య ప్రబంధాన్ని ప్రకాశింప చేయడానికి
నీవు శరగోప సూరి శిరస్సును వరిస్తున్నావు.
శబ్దాలంకార ప్రకరణం అపునర్యుక్త వ్యంజనం
శ్లో. హతచ్చండోఢాఘ ఝాటా వేల్లిదోషా మిళచ్ఛరం |
ఫణిశయ్యం రంగనాథం భజే బుధ సుఖావకం ||
వివరణ.
క్రూర పాపులు అయిన రాక్షసులను హతమార్చిన వానిని, నాగేంద్రున్ని పాన్పుగా
కలిగిన వానిని, దేవతలకు జ్ఞానమును, సుఖములను కూర్చు వానిని అయినట్టి
శ్రీరంగనాథుని సేవిస్తాను.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.