గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జూన్ 2024, ఆదివారం

తతాతత్తా తితత్తేతా .. శ్రీ రంగనాయక పాదుకా సహస్రం లోని 935 వ ఏకాక్షర శ్లోకం.

జైశ్రీరామ్. 

శ్రీ రంగనాయక పాదుకా సహస్రం లోని 935 వ ఏకాక్షర శ్లోకం.

తతాతత్తా తితత్తేతా 

తాత తీతేతి తాతితుత్ 

తత్తత్తత్తాత తితతా 

తతేతాతేత తాతుతా!!

పదచ్ఛేదం -

1. తతాతత్తా 

2. అతి తత్తేతా, 

3. తాతతి,

4. ఇతేతితాతితుత్,

5. తత్తత్తత్తాతతితతా,

6. ఆతతా,

7. తాతుతా,

8. తాతతి,

(తతాతత్తా తతా) 

తతా = విస్తృతమైన, 

అతత్తా = సంచరించే ధర్మం కలిగిన,

(అతితత్తేతా )

అతి = అతిక్రమించిన, 

తత్ + తా = పరబ్రహ్మ కలిగిన భావంతో,

ఇతా = కూడినట్టి, 

(ఇతేతి తాతితుత్)

ఇత = పొందిన,

ఈతి తా = ఈతిబాధలుకల(వారి) భావాన్ని, 

అతి = మిక్కలి.

తుత్ = నశింపజేయునట్టి, 

(తత్తత్తతా తతి తతా)

తత్ + తత్ = ఆయావస్తువుల యొక్క,

తత్ + తా = ఆయాధర్మం యొక్క, 

తతి = సముదాయంతో,

| తతా = విస్తరింపబడిన, 

ఆ తతా = పలుదెసల వీణాది వాద్య నాదం కలిగినట్టి,

(ఇతాతేతతాతుతా)

ఇ = మన్మథుని యొక్క, 

తాత = తండ్రియైన విష్ణువుతో,

ఇత = కూడిన, 

తాతుతా = పాదుక, 

తాతతి = తండ్రిలాగా ఆచరిస్తుంది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.