గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జూన్ 2024, ఆదివారం

కస్మిన్ వసంతి వద మీనగణా వికల్పం .. ప్రశ్నోత్తర గూఢ చిత్ర శ్లోకము.

జైశ్రీరామ్. 

ప్రశ్నోత్తర గూఢ చిత్రం

శ్లో.  కస్మిన్ వసంతి వద మీనగణా వికల్పం 

కిం, 'వా' పదం వదతి, కిం కురుతే వివస్వాన్? 

విద్యుల్లతా వలయవాన్ పథికాంగనానాం 

ఉద్వేజకో భవతి కః ఖలు వారివాహః.


1) కస్మిన్ వసంతి వద మీనగణా ? చేపలగుంపు ఎక్కడ ఉంటుంది?

2) వికల్పం కిం, 'వా' పదం వదతి? సందేహంతో చెప్పే పదం ఏది?

3) కిం కురుతే వివస్వాన్? సూర్యుడు ఏమి చేస్తాడు?

4) విద్యుల్లతా వలయవాన్ పథికాంగనానాం ఉద్వేజకో భవతి కః? 

బాటసారుల భార్యలకు మెరుపుతీగలతోకూడిన ఏది బాధ కలిగిస్తుంది?

ప్రశ్నోత్తర గూఢ చిత్రం ( సమాధానాలు )

ప్రశ్నోత్తర గూఢ చిత్రం ( సూచన )

కః ఉద్వేజకః భవతి=ఎవడు ఉద్వేగాన్ని కలిగిస్తాడు?

వారివాహః ఖలు=మేఘుడే కదా దీనిలో వారివాహః

1.చేపలగుంపు ఎక్కడ ఉంటుంది? సమాధానం 'వారి" నీటియందు ఉంటుంది. 

2. సందేహం తో చెప్పే పదం ఏది? 'వా' అనే అక్షరం (అవునా? కాదా?అనే 

అర్థం వస్తుంది.) 

3. సూర్యుడు ఏమి చేస్తాడు? సమాధానం 'అహః' పగలు సూర్యుడు పగటిని

 కలుగజేస్తాడు.

4.బాటసారుల భార్యలకు మెరుపుతీగలతో కూడి ఎవరు బాధ కలిగిస్తారు?

 'వారివాహః' అంటే మేఘము.సమాధానం . వర్షాకాలంలో బాటసారుల 

(బయటికి వెళ్ళినవారు) భార్యలు వియోగంతోనూ, వర్షంలో భర్తలు 

తడిసి పోతారేమో నని భయం తోనూ బాధపడతారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.