జైశ్రీరామ్.
|| 9-7 ||
శ్లో. సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్|
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్.
తే.గీ. పార్థ! కల్పాంతమందున ప్రాణికోటి
నాదు ప్రకృతిని పొందెడున్, నేనె మరల,
కల్పమారంభమైనప్డు కలుగు జీవ
కోటిని బయట వేయుదున్, గుంభనముగ.
భావము.
కుంతీ కుమారా! కల్పం పూర్తి అయినప్పుడు జీవులందరూ నా
ప్రకృతిని పొందుతారు. కల్ప ప్రారంభంలో జీవులందరిని నేనే
తిరిగి బయటికి వేస్తున్నాను.
|| 9-8 ||
శ్లో. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః|
భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్.
తే.గీ. ప్రకృతి వశమైనదైన యీ ప్రాణికోటి
ని మరలను నాదు మాయచే న్దిరిగి తిరిగి
సృష్టి జేయుచునుందును దృష్టిపెట్టి,
నీవు గ్రహియింపుమిద్దియు నిరుపమాన!
భావము.
ప్రకృతి వశమైన ఈ యావత్తును నేను నా మాయను ధరించి
తిరిగి తిరిగి సృజిస్తుంటాను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.