గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జులై 2022, మంగళవారం

కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా ..|| 9-33 || మన్మనా భవ మద్భక్తో . || 9-34 ||..//.. నవమోధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

  జై శ్రీరామ్.

|| 9-33 ||

శ్లో.  కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా|

అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్.

తే.గీ.  పుణ్యులైనట్టి బ్రాహ్మణుల్, పూజ్యులయిన

దివ్యరాజర్షులగువారి దెలుపనేల

నింక, క్షణిక మశాశ్వత మిద్ధరిత్రి

యిందు పుట్టిన నీవు నన్ పొందుమరసి.

భావము.

ఇక పుణ్యులైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షుల సంగతి చెప్పాడం 

దేనికి?క్షణికము, దుఃఖమయమూ అయిన ఈ లోకంలో పుట్టిన నీవు 

నన్ను సేవించుము.

 || 9-34 ||

శ్లో.  మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు|

మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః.

తే.గీ.  నీదు మదినాకునర్పించు, నేర్పుతోడ

నాదు భక్తుండవై వెల్గు నన్నె కొలిచి

వందనంబులు చేయుచు వదలక నను

నమ్మినన్ జేరగలవు నన్, సమ్మతి గను.

భావము.

నీ మనస్సును నాకు అర్పించు. నా భక్తుడివి కా. నన్ను ఆరాధించు. 

నాకే నమస్కరించు. ఇలా నాలో మనసు నిలిపి, నన్ను లక్ష్యంగా 

పెట్టుకొని నన్నే చేరుతావు.


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

రాజవిద్యారాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః.


జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.