జైశ్రీరామ్
|| 9-23 ||
శ్లో. యేప్యన్యదేవతా భక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః|
తేऽపి మామేవ కౌన్తేయ యజన్త్యవిధిపూర్వకమ్.
తే.గీ. భక్తు లన్యదేవతలను భక్తి గొలువ
యట్టిదేవతల్ నన్నె పూజాదికముల
సేవ జేయు టీవరయుమా చిత్తమందు
నేనె మూలమో యర్జునా నీవెరుగుము.
భావము.
అర్జునా ఇతర దేవతల భక్తులు కూడా తమ దేవతలను శ్రద్ధతో
ఆరాధిస్తుంటే, వాళ్ళు కూడా విధానం లేకుండా నన్నే ఆరాధిస్తున్నారు.
| 9-24 ||
శ్లో. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ|
న తు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే.
తే.గీ. అన్ని యజ్ఞంబులన్ భోక్తనరయ నేనె,
యధిపతియు నేనె, పూజింతు రన్యులయిన
దేవతాళిని వారు నన్ దెలియలేక
జన్మములు పొందుచుందురు సహజముగనె.
భావము.
నేనే అన్ని యజ్ఞాలకి భోక్తని అధిపతిని. ఇతర దేవతలను ఆరాధించే
వారు యదార్ధంగా నన్ను తెలుసుకోలేరు. అందువలన వాళ్ళు
(మరలా జన్మలలో)దిగజారి పోతున్నారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.