జైశ్రీరామ్.
.|| 10-3 ||
శ్లో. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్|
అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే.
తే.గీ. పుట్టుకయు మొదల్ లేనట్టి పూర్ణుడనని
ప్రభువుగా నేను జగతికి వరలుదునని
యెరుగు నాతండు సు జ్ఞాని, పరగునతడు
ఫాపదూరుడై ముక్తిని పడయగలడు,
నీవు గ్రహియింపుమియ్యది నేర్పు మీర.
భావము.
పుట్టుకా మొదలులేని వాడుగానూ, లోకాలకు ప్రభువుగాను
నన్ను తెలుసుకున్న వాడు మనుష్యులలో జ్ఞాని అయి అన్ని
పాపాలనుండి విముక్తి చెందుతాడు.
|| 10-4 ||
శ్లో. బుద్ధిర్జ్ఞాన మసమ్మోహః క్షమా సత్యం దమః శమః|
సుఖం దుఃఖం భవోऽభావో భయం చాభయమేవచ.
తే.గీ. తెలివి, జ్ఞానమ్ము, సత్యమ్ము, దివ్యమైన
మోహరాహిత్య మోర్పును, పొగడదగిన
మదిని నిగ్రహించెడి శక్తి,మరి భయాభ
యములు, సుఖదుఃఖములు నేనె యమర గనుదు.
భావము.
తెలివి, జ్ఞానం, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, మనో నిగ్రహము,
సుఖ దుఃఖాలు, ఉండడమూ, లేకపోవడమూ, భయాభయాలు
(నా వలననే కలుగుతాయి)
జైహింద్
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.