గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, జులై 2022, మంగళవారం

అవజానన్తి మాం మూఢా ..|| 9-11 || . మోఘాశా మోఘకర్మాణో .. || 9-12 ||..//.. నవమోధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

 జైశ్రీరామ్.

 || 9-11 ||

శ్లో.  అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్|

పరం భావమజానన్తో మమ భూతమహేశ్వరమ్.

తే.గీ.  భూత జాలాధిపతినైన పురుషుడ నగు

దేహములనాశ్రయించిన  మోహదూరు

నన్ను లక్ష్యంబు చేయరు నన్నెరుగని

మూర్ఖ మానవు లర్జునా! పుడమిపైన.

భావము.

జీవరాశికి అధిపతివై ఉండీ మానవ శరీరాన్ని ఆశ్రయించిన(నా 

పరమ తత్వాన్ని గుర్తెరుగలేని మూఢులు)నన్ను నిర్లక్ష్యం చేస్తారు.

|| 9-12 ||

శ్లో.  మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః|

రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః.

తే.గీ.  వారు వ్యర్థాశలను మరి వ్యర్థ  కర్మ

ములను వ్యర్థమౌ యజ్ఞానమున్ జెలంగి

మతులు చెడిపోయి రాక్షస మతుల బృథ్వి 

నాశ్రయించుచునుండుదురహరహంబు.

భావము.

వారు వృధా ఆశలతో దండగమారి కర్మలతో, అనవసరమైన జ్ఞానంతో, 

మతులు చెడి, భ్రాంతి గొలిపే ఆసురిక, రాక్షస ప్రకృతిని 

ఆశ్రయించిన వారౌతారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.