జైశ్రీరమ్
|| 10-11 ||
శ్లో. తేషామే వానుకమ్పార్థమహమజ్ఞానజం తమః|
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా.
తే.గీ. వారిని కనికరింప నవారిత గతి
మనసులందున నే నుందు, మానిత గతి
జ్ఞాన దీప్తిని గొల్పియజ్ఞాన మనెడి
తిమిర సంహారమును జేయ, ధీవరేణ్య!
భావము.
వారిని కనికరించడం కోసమే నేను వారి మనస్సులలో నిలిచి,
వారి అజ్ఞాన తమస్సుని ప్రకాశించే జ్ఞానదీపంతో నశింపజేస్తాను.
అర్జున ఉవాచ.
భావము.
అర్జునుడు పలుకుచుండెను.
|| 10-12 |||
శ్లో. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్|
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్.
తే.గీ. నీవె కన పరబ్రహ్మవు, నీవె పరమ
డవు, శాశ్వతుండవు, తలప జన్మ
లేనివాడవు, శుచివి సు జ్ఞాన ఖనివి
యాది దేవుడవరయగ ధీనిధాన!
భావము.
నీవు పరబ్రహ్మవి, పరంధాముడివి, పరమ పవిత్రుడివి, శాశ్వతుడివి,
దివ్యుడివి, పరమ పురుషుడివి ఆది దేవుడివి. పుట్టుక లేనివాడివి.
జైహింద్
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.