జైశ్రీరామ్.
|| 9-15 ||
శ్లో. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజన్తో మాముపాసతే|
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్.
తే.గీ. పరులు కనగ ద్వైతాద్వైత భావములను
విశ్వమంతటన్ గల నన్ను ప్రీతితోడ
నుపవసింతురు దీక్షతో నుత్తమమగు
జ్ఞాన యజ్ఞమ్ము మార్గాన ఘనతరముగ.
భావము.
మరి ఇతరులు జ్ఞానయజ్ఞం ద్వారా ఆరాధిస్తూ ఏకత్వ
(అద్వైత)భావంతో , వేరు అనే(ద్వైత)భావంతోనూ, విశ్వమంతటా
ఉన్న నన్ను ఉపాసిస్తారు.
|| 9-16 ||
శ్లో. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్|
మన్త్రోऽహమహమేవాజ్యమహమగ్నిరహం హుతమ్.
తే.గీ. నేనె క్రతువును, యజ్ఞంబు నేనె కనగ,
నాహుతులు నేనె హోమంబు నేనె పార్థ!
నేనె మూలికల్, మంత్రంబు నేనె, యగ్ని
నేనె, యాహుతు లరయఖ నేనెసుమ్ము.
భావము.
నేనే క్రతువుని, నేనే యజ్ఞాన్ని, పితరుల కర్పించ బడే ఆహుతునినేను.
హోమం చేసే మూలికలు నేను. మంత్రాన్ని నేను. అగ్నిని ఆహుతిని
కూడా నేనే.
జైహింద్,
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.