జైశ్రీరామ్.
|| 10-23 ||
శ్లో. రుద్రాణాం శఙ్కరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్|
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్.
తే.గీ. రుద్రులందు గన శంకరుండ నేనె,
యక్షరాక్షసులందున నక్షయమగు
ధనపతి యగు కుబేరుడన్, తలచి చూడ,
వసువులన్ బావకుడ నేనె, యసమ చరిత!
పర్వతంబుల మేరువై పరగు దేనె.
భావము.
నేను రుద్రులలో శంకరుణ్ణి, యక్ష రాక్షసులలో కుబేరుడిని, వసువులలో
పావకుడిని, పర్వతాలలో మేరువుని.
|| 10-24 |
శ్లో. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్|
సేనానీనామహం స్కన్దః సరసామస్మి సాగరః|
తే.గీ. అల పురోహితులందు బృహస్పతినయ!
స్కంధుడను సేనకధిపతులందు నేనె,
సరసులన్ సాగరము నేనె, సరస భావ!
పార్థ! నన్ను నీ వెరుగుము భవచయముగను.
భావము.
అర్జునా! నేను పురోహితులలో శ్రేష్టుడైన బ్రుహస్పతిని.
సేనానాయకులలో కుమారస్వామిని, సరసులలో సాగరాన్ని అని తెలుసుకో.
జైహింద్
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.