జైశ్రీరామ్.
|| 9-21 ||
శ్లో. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి|
ఏవం త్రయీధర్మమనుప్రపన్నా
గతాగతం కామకామా లభన్తే.
తే.గీ. స్వర్గ భోగులు తమపుణ్య చయము తరుగ
మనుజ లోకంబునే చేరు మరల,
కర్మబద్ధులకీగతి కలుగుచుండు
నన్నె నమ్మిన ముక్తి సంపన్నులగును.
భావము.
(స్వర్గాన్ని కోరే)వారు విశాలమైన స్వర్గాన్ని అనుభవించి తమ పుణ్యం
ఖర్చు అయిపోగానే మళ్ళీ మానవ లోకంలోకి ప్రవేసిస్తారు. ఇలా
వేదాలలోని ఉత్తమ లోకాలనిచ్చే కర్మ కాండను పట్టుకున్న
కామదాసులు(జనన మరణాలను)పొందుతుంటారు.
|| 9-22 ||
శ్లో. అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే|
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్.
తే.గీ. అన్య చింతన లేక నన్ననితరగతి
ఉపవసించుదురోవారి యోగమును, మరి
క్షేమమును నేను వహియింతు ప్రేమతోడ,
నీవు గ్రహియింపవలె నిది నేర్పుతోడ.
భావము.
అనన్య భావంతో నన్ను చింతిస్తూ నాయందే నష్ఠలిగి, ఏజనులు నన్ను
పరిపూర్ణంగా ఉపాసిస్తారో, వారి యోగకహేమాలను నేనే వహిస్తాను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.