గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జులై 2022, బుధవారం

యత్కరోషి యదశ్నాసివా ..|| 9-27 || .శుభాశుభఫలైరేవం . || 9-28 ||..//.. నవమోధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

 జైశ్రీరామ్,

|| 9-27 ||

శ్లో.  యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్|

యత్తపస్యసి కౌన్తేయ తత్కురుష్వ మదర్పణమ్.

తే.గీ.  అర్జునా! నీవు తినునట్టిదహరహంబు

చేయు దానిని, హోమంబు చేయ నదియు,

చేయుదానమున్ తపమును చేయగదగు

నర్పణంబును నాకు హృదర్పితమవ.

భావము.

అర్జునా నీవు ఏది తింటావో, ఏది చేస్తావో, ఏది హోమంచేస్తావో, ఏది 

దానం చేస్తావో, ఏది తపస్సు చేస్తావో, అది నాకు అర్పణము చెయుము.

|| 9-28 ||

శ్లో.  శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబన్ధనైః|

సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి.

తే.గీ.  

ఈ విధముగ సన్యాసయౌగీంద్రుడవయి

కర్మఫలబంధములు వీడి కలియు దీవు

నన్ను నర్జునా! యోగివై మిన్నగాను

ధర  శుభాశుభ ఫలములన్ దాటుమింక.

భావము.

ఈ ప్రకారంగా సన్యాసయోగంతో కూడుకున్న వాడవై 

శుభాశుభ ఫలాలు కలిసిన కర్మ భంధాల నుండి విడుదల 

పొంది, నీవు నన్ను చేరుకుంటావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.