గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జులై 2022, శనివారం

న చ మత్స్థాని భూతాని ..|| 9-5 || . యథా కాశ స్థితో నిత్యం .. || 9-6 ||..//.. నవమోధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

 జైశ్రీరామ్.

 || 9-5 ||

శ్లో.  న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్|

భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః.

తే.గీ.  లేవు ప్రాణులు నాలోన, నీవు నాదు

యోగ మహిమను కనుగొను మో నరుండ!

భూతసృష్టిని చేసి తత్ పోషకుడన

యియును లేనయ్య వాటిలో, నిజము గనుమ.

భావము.

ప్రాణులు కూడా నాలో లేరు. నా యోగమహిమని చూడు. భూత రాశిని 

పుట్టిస్తాను, భరిస్తాను కాని ఆభూతాలలో ఉండను.

|| 9-6 ||

శ్లో.  యథా కాశ స్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్|

తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ.

తే.గీ.  ఉండునాకసమునను ప్రచండవాయు

వెట్టులోయట్లె నాలోననే చరించు

ప్రాణులన్నియు సతతంబు పార్థ! కనుము.

నిజము గ్రహియించుమిప్పుడే నిర్భయముగ.

భావము.

సర్వత్రా సంచరించే ప్రచండ వాయువు ఎలాగైతే ఆకాశంలోనే 

ఉంటుందో, అలాగే అన్ని ప్రాణులు నా లోనే ఉన్నాయని తెలుసుకో.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.