జైశ్రీరామ్.
|| 10-13 ||
శ్లో. ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా|
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే.
తే.గీ. అని ఋషులునారదు డశితు, డందు రటులె
దేవలుడు వ్యాసుడందురు, తెలియునటుల
నీవు కూడ పల్కితివట్లె నేర్పుమీర,
తెలియ బల్కిన వినినచో తెలియనగును.
భావము.
అని అందరూ ఋషులు, దేవర్షి నారదుడూ, అలాగే అశితుడూ, దేవలుడూ,
వ్యాసుడూ అంటారు. స్వయంగా నీవుకూడా అలాగే చెబుతున్నావు.
|| 10-14 ||
శ్లో. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ|
న హి తే భగవన్వ్యక్తిం విదుర్దేవా న దానవాః.
తే.గీ. విశ్వశింతును నీ మాట విశ్వనాథ!
నీదు వ్యక్తమౌ దేహంబు నిరుపమాన
మెరుగ నేరరు దేవతల్ పరమపురుష!
యెరుగనేరరు రాక్షసుల్ నిరుపమాన!
భావము.
కేశవా! నీవు నాతో చెప్పినదంతా నిజమేనని విశ్వశిస్తున్నాను.
నీ వ్యక్త శరీరాన్ని దేవతలుకాని దానవులు కాని ఎరుగరు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.