గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జులై 2022, బుధవారం

స్వయమే వాత్మ నాత్మానం...10 - 15...//...వక్తుమర్హస్యశేషేణ దివ్యా.10 - 16,,,//...శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు...విభూతియోగః‌

 జైశ్రీరామ్

|| 10-15 ||

శ్లో.  స్వయమే వాత్మ నాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ|

భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే.

తే.గీ.  భూతభావనుడా! దేవ! భూతనాథ!

హే జగన్నాథ! నిన్ను నీవే యెరుంగు

దువు పురుష పుంగవా! హరీ! తోయజాక్ష!

కనగ నీ చేతనే, వర గుణనిధాన!

భావము.

భూత భావనుడా! భూతేశా! జగత్పతీ! పురుషోత్తమా! నిన్ను నీవే నీచేతనే 

స్వయంగా ఎరుగుదువు.

 || 10-16 ||

శ్లో.  వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః|

యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి.

తే.గీ. వ్యాపితంబయి జగతిలో వరలియుంటి వీవె

యేయేవిభూతులన్ ప్రీతితోడ

చెప్పగా నీకె సాధ్యమౌన్ గొప్పగాను

తనరు నాయా విభూతులన్ దరళనేత్ర.

భావము.

ఏయేవిభూతులలో నీవు ఈలోకమంతటా వ్యాపించి వున్నావో 

ఆదివ్యమైన విభూతులను అశేషంగా చెప్పడానికి నీవే తగినవాడివి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.