గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జులై 2022, శనివారం

ఆదిత్యానామహం విష్ణుర్జ్యో...10 - 21...//...వేదానాం సామవేదోస్మి .10 - 22,,,//...శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు...విభూతియోగః‌

 జైశ్రీరామ్

 || 10-21 ||

శ్లో.  ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్|

మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ.

తే.గీ.  విష్ణునాదిత్యులందున, వెలుగునిచ్చు

వారిలో సూర్యుడను నేను, మాననీయ!

యా మరుత్తులందుమరీచి,నరయ నేనె,

తారలందున చంద్రుడన్, ధర్మతేజ!

భావము.

నేను ఆదిత్యులలో విష్ణువుని, వెలిగునిచ్చే వాళ్ళలో కిరణములు 

కలిగిన సూర్యుడిని. మరుత్తులలో మరీచినీ, నక్షత్రాలలో చంద్రుడిని.

 || 10-22 ||

శ్లో.  వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః|

ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా.

తే.గీ.  వేదములలోన గన సామ వేదమేను,

దెవతలనింద్రుడనునేనె,భక్తవర్య!

యింద్రియంబులన్మనసునేనింద్ర తనయ!

ప్రాణులందున చైతన్య భావమేనె.

భావము.

నేను వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియాలలో 

మనస్సుని, ప్రాణులలో చేతనత్వాన్ని.

జైహింద్..

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.